అక్రమదారులకు అలర్ట్.. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీనే?

HYDRAA: నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టి వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది.

HYDRAA: నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టి వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది.

హైడ్రా.. నగరంలో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు ఏ స్థాయిలో హడలెత్తిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగరంలోని చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు అని తేడా లేకుండా..  ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో సామన్యులు, ధనికులు అనే తేడా లేకుండా.. రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై నిర్ధాక్ష్యిణ్యంగా కూల్చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, నోటిసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే..హైడ్రా బుల్డోజర్లతో ఆ అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంపై హైడ్రా కూల్చివేయడానికి వస్తుందనని అక్రమదారులకు గుండెల్లో గుబులు పుడుతంది. అయితే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ ఎక్కడంటే..

నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా తాజాగా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది.  ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడ రెండు నాలాలాను సర్వే చేసేందుకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సర్వే ద్వారా ఈ నాలలపై ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్కార్ ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలన్నది నిర్ణయిస్తాం.  ప్రస్తుతానికి మాత్రం ఈ సర్వే చేపట్టానికి మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా, ఇప్పటికే ఈ విషయంపై హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సమావేశమైనట్లు తెలిసింది.

ఇకపోతే హైటెక్ సిటీ పరిధిలో  ఇటీవలే కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు మొత్తం మునిగిపోయాయిన విషయం తెలిసిందే. దీంతో వానలు ఎక్కువగా పడుతున్నప్పుడు  హైటెక్​సిటీ పరిధిలో ఉన్న ఆ రెండు నాలాలు సమీపంలో ఉన్న ఏయే కాలనీలు మునుగుతున్నాయి? కారణాలేమిటి అనేది హైడ్రా ఇప్పుడు తెలుసుకోనుంది. పైగా  నీళ్లు నిండిన ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి ఆక్రమణలను గుర్తించి, ఆ తర్వాత కూల్చివేతలకు దిగబోతుందని సమాచారం. ఒకవేళ అదే కనుకు నిజమైతే ఈసారి హైటెక్ సిటీ పరిధిలో ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు బయటపడతాయో, మరెన్నీ నిర్మాణలు కూలబడతాయో అనే విషయాలు త్వరలోనే తెలియరానుంది. దీంతో ప్రస్తుతం హైటెక్ సిటీ పరిధిలో ఉన్న అక్కమదారులకు ఈ సమాచారం వినిపించడంతో ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. మరీ, హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ అనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments