P Krishna
Hyderabad Traffic Police: ఎన్ని ఆంక్షలు విధించినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.. నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Traffic Police: ఎన్ని ఆంక్షలు విధించినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.. నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వాహనదారులు రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రధాన కర్తవ్యం. కానీ చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే గతంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని పోలీసులు ఆపి చలాన్లు రాసేవారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కెమెరాల్లో ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. రాంగ్ రూట్ లో వచ్చినా ఎక్కడో ఉండి కెమెరాతో క్లిక్‌మనిపించి చలాన్లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని చలాన్లు విధించినా, ఎన్ని రూల్స్ తెచ్చినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే సమయంలో మనిషి ప్రాణం విలువ తెలిసి ఉండాలి. కానీ ఈ మధ్య కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది అమాయకుల చనిపోతున్నారు.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినతరం చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లు చెల్లింపు విధానంలో కొత్త పద్దతి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లు విధించి వెంటనే సదరు వాహనదారుడికి అలర్ట్ పంపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
కొత్త పద్దతి ప్రకారం.. ఇకపై వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే అతని ఫోన్ నెంబర్ కి ట్రాఫిక్ చలాన్ వెళ్లిపోతుంది. ఆ పై చలాన్లు వెంటనే సులభంగా చెల్లించేందుకు వీలుగా యూపీఐ యాప్స్ గుగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఆప్షన్లు కల్పించాలని భావిస్తుంది. చలాన్లే పడిన వెంటనే ఈజీగా వాటిని క్లీయర్ చేసి ఎలాంటి పెండింగ్ లేకుండా చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతుంది. ప్రస్తుతం వాహనదారుల చలాన్లు పెద్ద ఎత్తున పెండింగ్ ఉంటున్నాయి. ఇకపై రూల్స్ అతిక్రమిస్తే వాహనదారులకు అలర్ట్ పంపడం వల్ల వెంటనే చలాన్ కట్టే వీలు ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఈ విధానం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ముందుగా హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.