Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. 5 రోజులు ఫ్లైఓవర్ ​బంద్!

Hyderabad Traffic Updates: హైదరాబాద్ లో ఇటీవల రోడ్లపై రద్దీ బాగా పెరిగిపోయింది. రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో పలు చోట్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులు తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతున్నారు.

Hyderabad Traffic Updates: హైదరాబాద్ లో ఇటీవల రోడ్లపై రద్దీ బాగా పెరిగిపోయింది. రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో పలు చోట్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులు తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతున్నారు.

హైదరాబాద్ లో రోజు రోజుకీ జనాభా శాతం పెరిగిపోతుంది.. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. దీంతో నగరంలో రద్దీ బాగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఫ్లై ఓవర్ పై ఏదైనా సమస్యలు వస్తే మూసివేసి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తుంటారు జీహెచ్ఎంసీ. హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్. శిల్పా లేవుట్ లెవల్ – 2 ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. ఈ కారణంగా అక్కడ ఐదు రోజుల పాటు ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్ లెవల్ -2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ కారణంగా ఐదు రోజుల పాటు అంటే సోమవారం 12వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లై ఓవరు మూసివేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.గచ్చిబౌలి గుండా వెళ్లాల్సిన వాహనాలు ఆ మార్గం గుండా కాకుండా మరో మార్గం వైపు మళ్లింపులు చేపట్టారు. బయోడైవర్సీటి జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్, బైపాస్, బ్రిడ్జీ గుండి టెలికాం నగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటి జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు బ్రిడ్జీ గుండా గచ్చిబౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ చేరుకోవాలి.  ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజుల పాటు ఉంటాయి.. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలకు అనుసరించి తమకు సహకరించాలని సైబరా పోలీసులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజులు ఉంటాయి.. గురువారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 12వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది.అటుగా వచ్చే వాహనదారులకు సరైన సమాచారం అందించాలని ట్రాఫిక్ పోలీసులకు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. ఐదు రోజుల వరకు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సిందిగా సూచించాలని తెలిపారు.

Show comments