Heavy Rain In Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. నేడు రోజంతా భారీ వర్షం!

హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. నేడు రోజంతా భారీ వర్షం!

Heavy Rain In Hyderabad: హైదరాబాద్ నగరాన్ని వాన వదలడం లేదు. గురువారం సాయంత్ర దంచికొట్టిన వాన..శుక్రవారం కూడా తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్ వాసులకు భారీ రెయిన్ అలెర్ట్ వచ్చింది.

Heavy Rain In Hyderabad: హైదరాబాద్ నగరాన్ని వాన వదలడం లేదు. గురువారం సాయంత్ర దంచికొట్టిన వాన..శుక్రవారం కూడా తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్ వాసులకు భారీ రెయిన్ అలెర్ట్ వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం విచిత్రంగా కనిపిస్తుంది. కొద్ది రోజులు అదిరిపోయే ఎండలు కాస్తుంటే.. మరికొద్ది రోజులు వానలు దంచికొడుతున్నాయి. అసలు ప్రస్తుతం ఎండాకాలామా, వానాకాలామా అర్థంకాని విధంగా ఉంది. ఇది ఇలా ఉంటే హైదారాబాద్ లో గురవారం వాన దంచికొట్టింది. రోజంతా వివిధ ప్రాంతాల్లో కుండపోతా వాన కురిసింది. ఇక సాయంత్రం సమయంలో అయితే మరో స్థాయిలో వాన విజృంభించింది. ఇది ఇలా ఉంటే..మరుసటి రోజు శుక్రవారం కూడా హైదరాబాద్ లో వానలు అదరగొడుతున్నాయి. ఈ క్రమంలోనే నగర వాసులకు రెయిన్ అలెర్ట్ వచ్చింది.

శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వాన కురుస్తోంది. పంజాగుట్టా, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతారాతాబాద్, అమీర్ పేట్, టోలీ చౌకి వంటి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వాన నీరు చేరింది.  ఇలా వరుసగా రెండు రోజుల నుంచి వానలలు పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

Show comments