అమెరికా తరహాలో Hyderabadలో అద్భుతం.. ఏకంగా 4100 ఎకరాల్లో రాజీవ్ పార్క్

Hyd Rajiv Park: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా తరహాలో హైదరాబాద్ లో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

Hyd Rajiv Park: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా తరహాలో హైదరాబాద్ లో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

ప్రపంచ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రస్తుతం భాగ్యనగరంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గ్లోబల్ కంపెనీలతో ఇటు విశ్వనగరంగా.. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కోండ కోట సహా, హుస్సేన్ సాగర్, అతి ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి గాంచింది. ఏటా విశ్వనగరం పర్యటనకు వేలాది మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. భాగ్యనగరం ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే  తాజాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా తరహాలో భాగ్యనగరంలో అద్భుతాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఆ వివరాలు..

అమెరికాలోని న్యూయార్క సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. సుమారు 4,100 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్క్ చుట్టూ బిలియనీర్లు, ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాన్‌హట్టన్‌లో సుమారు 843 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌ ఉంది. అగ్రరాజ్యంలో ఇదే తొలి ల్యాండ్‌స్కేప్‌ పార్క్‌ ఇదే కావటం విశేషం. దీనిలో సినిమా షూటింగ్‌ లోకేషన్లు, ఫారెస్ట్, థియేటర్, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ జోన్స్, జూ వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. వాక్‌వేలు, సైక్లింగ్, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక డయాస్‌లను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నగరంలోనూ ఈ తరహా పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాజీవ్‌ పార్క్‌ పేరుతో.. ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. సుమారు 4,100 ఎకరాలను దీన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇందుకోసం భూమిని సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పార్క్ చుట్టూ లగ్జరీ భవనాలు నిర్మించమే కాక.. వాటిల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, సెలూన్, స్పా, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌, ప్రైవేట్‌ ఔట్‌డోర్‌ స్పేస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయిని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి అందుబాటులోకి వస్తే.. ప్రపచంలోనే ఆకర్షణీయ నగరాల్లో ఒకటిగా హైదరబాద్ నిలవనుంది అంటున్నారు.

Show comments