HYDRA: నగరంలో హైడ్రా దూకుడు.. మద్దతిస్తోన్న జనాలు..!

Hyderabad People Support of HYDRA: ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర వాసులు మద్దతిస్తున్నారు. హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

Hyderabad People Support of HYDRA: ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర వాసులు మద్దతిస్తున్నారు. హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రభుత్వ ఆస్తులను రక్షించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ.. హైడ్రాని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తోంది ఈ వ్యవసథ. హైడ్రా ఏర్పాటైన తొలి రోజు నుంచే దూకుడుగా ముందుకు వెళ్తుంది. పేద, ధనిక, సినిమా, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత పెను సంచలనంగా మారింది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలానే మాదాపూర్‌ పరిధిలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు హైడ్రా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇక ఈ 58 రోజుల పరిధిలోనే హైడ్రా నగర వ్యాప్తంగా 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని సుమారు 166 ఆక్రమణలు నేలమట్టం చేసింది. ఇక వీటి విస్తీర్ణం 43.94 ఎకరాలు అని తెలిస్తుందో. బంజారహిల్స్‌ లోటస్‌ పాండ్‌ మొదలు, మన్సూరాబాద్‌, బీఆర్‌కేనగర్‌, గాజులరామారం, అమీర్‌పేట, మాదాపూర్‌, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిటన్లు వెల్లడించింది. వీటిల్లో సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన నిర్మాణాలు కూడా ఉండటం గమనార్హం. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో పాటుగా.. వాటికి మద్దతిస్తోన్న వారిపై చర్యలకు రెడీ అయ్యింది హైడ్రా. ఈ క్రమంలోనే ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.

హైడ్రాకు జనాల మద్దతు..

హైడ్రా చర్యలపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్‌ నగరాన్ని పరిరక్షించుకోవాలంటే.. హైడ్రానే కరెక్ట్‌ అంటున్నారు. హైదరాబాద్‌ మనది.. హైడ్రా మనందరిది అంటూ ర్యాలీలు తీస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతలను స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హైడ్రాకు అనుకూలంగా గండిపేట అవతలి కట్ట నుంచి ఇవతలి వరకు భారీ ర్యాలీ తీశారు. చెరువులను రక్షించుకుందాం.. భావి తరాలను కాపుడుకుందాం.. నీటి వనరులుంటేనే మనుషుల మనుగడ.. ఆక్రమణలు తొలగిద్దాం.. చెరువులను బతికిద్దామంటూ నినాదాలు చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి ఈ స్థాయిలోమద్దతు రావడం మాత్రం విశేషం

Show comments