P Krishna
Smoke From The Ground KBR Park: తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో ఓ వింతఘటన చోటు చేసుకుంది
Smoke From The Ground KBR Park: తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో ఓ వింతఘటన చోటు చేసుకుంది
P Krishna
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకొనిపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో కమ్యూనికేషన్ బంద్ అయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో ఎటు చూసినీ వరదనీరే కనిపిస్తుంది. హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తుతుంటే.. ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం హైదరాబాద్ లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా నీటితో మునిగిపోయి ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో భూమి తేమగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పై పొగ చిన్న మొదలై క్రమంగా పెద్దదైంది. భూమి పొరల నుంచి పొగలు రావడం చూసి వాహనదారులు, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు వర్షాలు పడుతున్నాయి.. ఇలాంటి సమయంలో భూమి లో నుంచి ఆ విధంగా పొగలు రావడం అయోమయానికి గురి చేసింది.
భూమిలో నుంచి ఒక్కసారే పొగలు రావడంతో ఎమైతుందో అన్న భయంతో వాహనదారులు, స్థానికులు భయంతో వణికిపోయారు. ఈ వింత సంఘటన ఏంటా చూడటానికి జనాలు ఎగబడటంతో కొంతసమయం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇటీవల అందే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్ ను అమర్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు రావొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్ని విషయం తెలుసుకునేందుకు అధికారులు రంగంలో దిగారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజలను చెదరగొట్టారు.