ప్రయాణికులకు అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టు కీలక సూచనలు!

Hyderabad Airport: రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైదరాబాద్ లోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి.  దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న ఎయిర్ పోర్టుగా శంషాబాద్ పేరు తెచ్చుకుంది. తాజాగా ప్యాసింజర్లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కీలక సూచనలు చేసింది.

Hyderabad Airport: రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైదరాబాద్ లోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి.  దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న ఎయిర్ పోర్టుగా శంషాబాద్ పేరు తెచ్చుకుంది. తాజాగా ప్యాసింజర్లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కీలక సూచనలు చేసింది.

నేటికాలంలో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. అలానే పలు నగరాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రద్దీ బాగా ఉంటుంది. అలా రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైదరాబాద్ లోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి.  దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న ఎయిర్ పోర్టుగా శంషాబాద్ పేరు తెచ్చుకుంది. ఇన్ని రోజులు లక్షల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో రద్దీగా మారి శంషాబాద్ ఎయిర్ పోర్టు వార్తల్లో నిలిచింది. అంతేకాక ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తరచూ కీలక సమాచారం అందిస్తుంది. అలానే తాజాగా ప్యాసింజర్లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కీలక సూచనలు చేసింది. మరి..  వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచనలు చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్యాసింజర్ల రద్దీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఆ వారం రోజుల పాటు ఫ్లైట్ జర్నీ చేసే వారు ఎయిర్ పోర్ట్ కు ముందుగానే చేరుకోవాలని శంషాబాద్ ఎయిర్ పోర్ట్  అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా త్వరలో రాఖీ పండుగ రానున్న సంగతి తెలిసిందే.

రాఖీ కారణంగా ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతుందని విమానాశ్రయ అధికారులు అంచనా వేసింది. ఈమేరకు  ప్రయాణికులు విమానం బయటలు దేరే సమయాని కంటే ముందే రావాలని సూచించింది.  జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణం చేసే ఇద్దరికీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు సూచనలు చేశారు. ఆగస్టు 15 నుంచి ఆగష్టు 19 మధ్య  తేదీల్లో ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో, వారు విమానాశ్రాయానికి ముందే చేరుకోవాలని కోరింది. రద్దీ కారణంగా  తనిఖీల విషయంలో ఆలస్యం కావచ్చని, ఈ క్రమంలోనే త్వరగా వస్తే.. ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టు విషయానికి వస్తే.. అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటి. ఇక్కడి నుంచి నిత్యం వందలాది మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. అంతేకాక ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు, సదుపాయాలు అందిస్తూ..పలు అవార్డులను సొంతం చేసుకుంది. అలానే అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో వివిధ గుర్తింపులను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుకుంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ప్యాసింజర్లకు ఇబ్బందులు కలగకుండా ఇలా సమాచారం ఇస్తుంటారు. మొత్తంగా ఆగష్టు 15వ తేదీ నుంచి 19 వరకు ఎవరైనా ఫ్లైట్ జర్నీలు చేస్తుంటే.. అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తే ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.

Show comments