వీడియో: Hydలో భారీ వర్షానికి రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి..!

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం జలమయం అయ్యింది.. ఎక్కడ చూసినా వరదనీరు కనిపిస్తుంది.

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం జలమయం అయ్యింది.. ఎక్కడ చూసినా వరదనీరు కనిపిస్తుంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చూపిస్తుంది. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడింది. వర్షానికి వరద నీటితో రోడ్లు చెరువుల్లా తలపిస్తున్నాయి. మ్యాన్ హూల్స్, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతల్లో పూర్తిగా జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడటంతో ప్రజలు వణికిపోయారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు. తాజాగా భారీ వరద కారణంగా ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతున్న వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.

అంబర్‌పేట్, రాంనగర్ లో భారీ వర్షాల కారణంగా నాలు పొంగి పొర్లుతున్నాయి.   రాంనగర్‌లో స్కూటీతో ఓ వ్యక్తి ప్రయాణిస్తుండగా హఠాత్తుగా నీరు పెరిగిపోవడంతో  బండితో సహా వెనక్కకు కొట్టుకొని వచ్చాడు. అది గమనించి ఇద్దరు వ్యక్తులు పరుగున వెళ్లి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేశారు. కాన నీటి ప్రమవాహం వారిని సైతం వెనక్కి నెట్టింది. అలా స్కూటీతో సహా ముగ్గురూ వెనక్కి కొట్టుకుంటూ వెళ్లారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

మంగళవారం నగరంలో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షంతో విద్యార్థులు బయటకు వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున సెలవు ప్రకటించినట్లు తెలుస్తుంది. రాజేంద్ర నగర్, బషీర్ బాగ్, రాంనగర్, అత్తాపూర్, జూబ్లీ హిల్స్, ఫిలిమ్ నగర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, తార్నాక, మేడ్ చెల్ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Show comments