iDreamPost
android-app
ios-app

హర్షసాయికి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. ఇక తప్పించుకోవడం కష్టమే

  • Published Oct 05, 2024 | 1:51 PM Updated Updated Oct 05, 2024 | 1:51 PM

హర్షసాయి కేసు రోజుకొక మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చారు నార్సింగి పోలీసులు. ఇంతకు ఏమైందంటే.?

హర్షసాయి కేసు రోజుకొక మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చారు నార్సింగి పోలీసులు. ఇంతకు ఏమైందంటే.?

  • Published Oct 05, 2024 | 1:51 PMUpdated Oct 05, 2024 | 1:51 PM
హర్షసాయికి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. ఇక తప్పించుకోవడం కష్టమే

హర్షసాయి కేసు రోజుకొక మలుపు తీసుకుంటుంది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, రూ. 2 కోట్లు కాజేశాడంటూ ఓ నటి పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు అతడి అరెస్టుకు రంగం సిద్దం చేశారు. అప్పటి నుండి పరారీలో ఉన్నాడు ఈ యూట్యూబర్, అతడి ఫ్యామిలీ. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం  పోలీసులు ముమ్మరంగా  గాలిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేశారు.  తాజాగా హర్ష సాయికి బిగ్ షాక్ ఇచ్చారు.  అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దేశం విడిచి వెళ్లిపోవడానికి వీలు లేకుండా పోయింది. అతడు విదేశాలు పారిపోయే అవకాశాలున్నాయని బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే కేసు నమోదైన నాటి నుండి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. దీంతో నార్సింగి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయక తప్పలేదు.

హర్షసాయిపై తాజాగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియా వేదికగా ఈ యూట్యూబర్ ట్రోలింగ్ చేస్తున్నాడని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో మరో కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతని తండ్రి రాధా కృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కేసులో నిందితులుగా చేర్చక ముందే బెయిల్ ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించింది. ఆ పిటిషన్ కొట్టివేసింది. కాగా, గతంలో బాధితురాలు హర్షసాయితో పాటు అతడి తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. హర్ష తండ్రి రాధా కృష్ణ తనను బ్లాక్ మెయిల్ చేశారంటూ పేర్కొంది. కానీ పోలీసులు కేవలం హర్షసాయిపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించారు. ఇప్పుడు హర్షసాయికి లుకౌట్ నోటీసులు జారీ చేసి బిగ్ షాక్ ఇచ్చారు నార్సింగీ పోలీసులు. దీంతో విదేశాలు పరారవ్వాలన్న యూట్యూబర్ ప్లాన్స్ బెడిసికొట్టినట్లే లెక్క.

హర్షసాయి యూట్యూబరే కాదు.. సామాన్యులకు హీరో. పేదలు, చిరు వ్యాపారం చేసుకుని బతుకుతున్న ఎంతో మందికి డబ్బులు పంచి ఫేమస్ అయ్యాడు. విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న యూట్యూబర్. ఎవరైనా హర్షసాయిని ఏదన్నా అంటే ఫైర్ అయ్యేవారు. అతడిపై మాట పడనిచ్చేవారు కాదు. కానీ అనూహ్యంగా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. మంచి తనం ముసుగులో ఓ నటికి దగ్గరై.. ప్రేమ, పెళ్లి పేరుతో వలపన్నాడు. నటిని లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె దగ్గర నుండి రూ. 2 కోట్లు తీసుకున్నాడు. చివరకు ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. మోసపోయానని గ్రహించిన నటి.. నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.  తెచ్చుకున్న పేరంతా.. పొగొట్టుకుని నిందితుడయ్యాడు.  లైఫ్ లో డ్రాస్టింగ్ ఛేంజ్ అంటే ఇదేనేమో.. ఏమంటారు..?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom