బ్రేకింగ్: హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు ఎందుకంటే?

144 Section in Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ల మధ్య జరుగుతున్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి.

144 Section in Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ల మధ్య జరుగుతున్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి.

తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రచ్చ మొదలైంది. కౌశిక్ రెడ్డి పార్టీలో కోవర్టుగా ఉన్నారని, అతని వల్లనే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ ఇంటకి వచ్చి.. ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తా అంటూ గాంధీకి.. కౌశిక్ సవాల్ విసిరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం పతాకస్థాయికి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే DCP కోటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశక్ రెడ్డి చేసిన సవాల్‌కి స్పందిస్తూ అరికెపూడి గాంధీ నిన్న కొండాపూర్ లో ఉన్న ఆయన ఇంటికి తన అనుచరులతో వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని గొడవను సర్ధుమణిగేలా చేశారు. కౌశిక్ రెడ్డిపై దౌర్జనం జరిగిందని.. ఆయనపై దాడులకు తెగబడ్డారని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తన గొడవకు దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరికొంతమందిని హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలులో ఉందని.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరే సమయంలో ఇరువురిని పోలీసులు అడ్డుకొని గృహనిర్భంధంలో ఉంచారు. సాయంత్రం వరకు హౌజ్ అరెస్టులో ఉంచి సాయంత్రం పరిస్థితిని బట్టి విడుదల చేస్తామని ప్రకటించారు. నగరంలో ఎలాంటి గొడవలు జరగకుండా 144 అమల్లో ఉందని కోటిరెడ్డి అన్నారు. మరోవైపు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 విధించినట్లు ఆయన తెలిపారు.

Show comments