రాంనగర్‌లో హైడ్రా హడల్.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కూల్చివేత!

Hydra Demolishing Illegal Structures Built in Ramnagar: హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల, నాళాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టుకున్న నిర్మాణాలు కూల్చివేస్తు కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతుంది.

Hydra Demolishing Illegal Structures Built in Ramnagar: హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల, నాళాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టుకున్న నిర్మాణాలు కూల్చివేస్తు కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతుంది.

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరే వినిపిస్తుంది. హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వరదలకు శాశ్వత పరిష్కారం చేపట్టడానికి ‘హైడ్రా’ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనికి చైర్మన్ గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ‘హైడ్రా’ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. అక్రమ నిర్మాణాలకు నోటీస్ ఇస్తూ కూల్చి వేస్తున్నారు. మాదాపూర్ లో హీరో నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వేన్షన్ సెంటర్ కూల్చి వేత తర్వాత హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. తాజాగా ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కూల్చి వేత కార్యక్రమాలు మొదలు పెట్టింది హైడ్రా. వివరాల్లోకి వెళితే..

ఇటీవల హైదరాబాద్‌లో ‘హైడ్రా’ హడలెత్తిస్తుంది. సామాన్య, రాజకీయ, సినీ, వ్యాపార రంగంలో ఉన్న ఎవరైనా అక్రమంగా కట్టడాలు నిర్మించినట్లు ఫిర్యాదు అందితే చాలు.. ఎంక్వైయిరీ చేసి నిజమని తేలితే వెంటనే కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యారు హైడ్రా అధికారులు. ఈనేపథ్యంలోనే రాంగనగర్ లోని మణెమ్మ కాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. హైడ్రా అధికారులకు రాంనగర్‌లోని మణెమ్మ నాలాలపై కొంతమంది అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఫిర్యాదు అందాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఇక్కడ పరిస్థితులు పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.

నిర్మాణాలు అక్రమమే అని నిర్దారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం(ఆగస్టు 30) ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల వర్షాలు పడితే నీటి ప్రవాహం సరిగా లేకపోవడంతో కాలనీలో వరద నీరు చేరి ప్రజాలు నానా అవస్థలు పడ్డారు. నాలాలు క్లీయర్ కావడం వల్ల ఇలాంటి సమస్యలు రావని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటి వరకు  చెరువులు, నాళాలు, ఖాళీ భూములు అక్రమించి కట్టడాలు చేపట్టిన కబ్జాదారుల దారుణాలు ఒక్కొటి వెలుగు చూడటం., వాటిని ‘హైడ్రా’ కూల్చి వేయడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు తెలంగాణ ప్రజలు.

Show comments