Rains in Telangana: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

Rains in Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయంటే?

Rains in Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయంటే?

ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే భారీగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దున వేళ ఎండకొడుతున్నప్పటికీ సాయంత్రం అయ్యే సరికి కారు మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం కురుస్తున్నది. ఈక్రమంలో తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని జగిత్యాల, మంచిర్యాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురువనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరముంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంపై మేఘం వచ్చి విరుచుకుపడ్డట్టుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. బాటసారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నేడు కూడా నగరంలో వర్షం దంచికొట్టనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాతావరణం చల్లబడింది. మేఘాలు ఆవరించి వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Show comments