Arjun Suravaram
Hyderabad News: హైదరాబాద్ నగరంలో రోడ్డు కుంగిపోయిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై కూడా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోతున్నాయి. తాజాగా అంబర్ పేట్ నియోజవర్గంలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Hyderabad News: హైదరాబాద్ నగరంలో రోడ్డు కుంగిపోయిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై కూడా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోతున్నాయి. తాజాగా అంబర్ పేట్ నియోజవర్గంలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
హైదరాబాద్ నగరంలో రోడ్డు కుంగిపోయిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై కూడా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోతున్నాయి. గతంలో గోషామహల్ ప్రాంతంలోని ఓ మార్కెట్ కింద ఉన్న నాల కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కార్లు, బైకులతో సహా పలు వాహనాలు నాళలో పడిపోయాయి. అలానే పలువురుకి గాయాలు అయ్యాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా అంబర్ పేట్ నియోజవర్గంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న లారీ అందులో ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట్ నియోజవర్గంలో రోడ్డు కుంగిపోయిన ఘటన చోటుచేసుకుంది. శివం రోడ్ ప్రాంతంలోని ఆజాం కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారి కుంగిపోయింది. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ప్రమాదానికి గురైంది. కుంగిపోయిన రోడ్డులో ఈ టిప్పర్ లారీ ఇరుక్కుపోయింది. అది ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను ఇతర మార్గాల్లో పంపించారు. ఇక కుంగిన రోడ్డులో ఇరుక్కుపోయిన వాహనాన్ని..అక్కడి నుంచి తొలగించారు. అనంతరం వాహనాలను దారి మళ్లీస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. గతంలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ముఖ్యంగా వర్షాలు కురిసిన సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వర్షాలకు బాగా నానిపోవడం కారణంగా.. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో రహదారుల కింద నాళ్లలు ప్రవహిస్తున్నా కారణంగా..కొన్ని ప్రాంతాలు అవి ఒక్కసారిగా కూలిపోతున్నాయి. గతంలో ఉప్పల్, మియాపూర్, గోషామహల్ వంటి వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అప్పట్లో ఫ్లైఓవర్ కోసం రోడ్డు మధ్యలో నిర్మించిన పిల్లర్‌కు దగ్గరగా డ్రైవర్ కారును ఆపాడు.
ఆ సమయంలో అక్కడ మట్టి ఒక్కసారిగి కుంగి, పెద్ద గొయ్యి ఏర్పడింది. కారు ముందు టైరు గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్… ఇంజన్ ను ఆపి, బయటకు వచ్చి ఇతరుల సహాయంతో కారును బయటకు తీశారు. అలానే గోషామహాల్ ప్రాంతంలో కూడా రోడ్డు కుంగిపోయింది. తాజాగా అంబర్ పేట్ లో రహదారి కుంగిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి లోపలి భాగంలో మట్టి నాని కూరుకు పోవడంతోనే రోడ్డు కుంగిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు గొయ్యిని త్వరగా పూడ్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.