Tirupathi Rao
GHMC Commissioner Amrapali- Uses Of GIS Survey: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులను అందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులు కృష్టి చేస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. అలాగే జీఐఎస్ సర్వేకి సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృతి చేశారు.
GHMC Commissioner Amrapali- Uses Of GIS Survey: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులను అందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులు కృష్టి చేస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. అలాగే జీఐఎస్ సర్వేకి సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృతి చేశారు.
Tirupathi Rao
గ్రేటర్ ప్రాంత ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గుడ్ న్యూస్ అందించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు చేశారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మెషన్ సిస్టం(GIS) సర్వేతో ప్రజలకు అందబోయే సేవలు, ఈ సర్వే ద్వారా జరగనున్న లాభాలకు సంబంధించి పలు అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సర్వే చేసిన తర్వాత ప్రతి ఇంటికి ఒక యూనిక్ ఐడీ నంబర్ వస్తుందని చెప్పారు. అలాగే దానితోపాటుగా క్యూఆర్ కోడ్ లాంటి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కోడ్ ద్వారా ప్రతి ఇంటింకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. వారికి మరింత సులభతరంగా సేవలు అందించవచ్చు అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు అంతా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ జీఐఎస్ సర్వేని కూడా తీసుకొచ్చారు. ప్రజలకు ముఖ్యంగా అడ్రెస్, లొకేషన్ కి సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అలాగే క్యాబ్ బుక్ చేసుకోవడానికి.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఎగ్జాట్ లొకేషన్ డీటెయిల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ కి సంబంధించి తాను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆమ్రపాలి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కోడ్ వల్ల అలాంటి సమస్యలు తొలగిపోతాయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాలనీలు, ఇళ్లకు సంబంధించి సమస్యలను అడ్రెస్ చేయడంలో కూడా ఈ కోడ్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది అన్నారు. ఈ సర్వే తర్వాత చెత్త సేకరణకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు.
ఈ జీఐఎస్ సర్వేని శాటిలైడ్, గ్రౌండ్ ఫిజికల్ విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ వంటి 5 సర్కిల్స్ లో ప్రారంభించామన్నారు. 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైనట్లు తెలిపారు. అతి త్వరలో 1.40 లక్షల ప్లాట్స్ ని డిజిటలైజ్ చేయడమే కాకుండా.. ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్ ఇస్తామన్నారు. ఈ సర్వేకి సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని తెలిపారు. సర్వేలో కేవలం అవసరమైన డాక్యుమెంట్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్, యుటిలిటీస్ వంటి వివరాలు మాత్రమే సేకరిస్తారని స్పష్టం చేశారు. ఫిజికల్ సర్వేలో ఎవరినీ వ్యక్తిగత వివరాలు అడగడం లేదు అనే విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా అలాంటి వివరాలను అజిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ ఫిజికల్ సర్వేకి కూడా నగరవాసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ తీసుకురానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.