Hyderabad: ప్రతినెల ఆ రోజున సెలవు ఇవ్వాలని డిమాండ్!

ప్రతినెల ఆ రోజున సెలవు ఇవ్వాలని డిమాండ్!

Hyderabad: రెండో శనివారం అంటే ఎవరికైనా ఇష్టమే.. ఎందుకంటే సెకండ్ శాటర్ డే, తర్వాత సండే రెండు రోజులు వరుసగా సెలవులు కలసి వస్తాయి.. అందుకే విద్యార్థులు, పలువు ఉద్యోగులు రెండో శనివారం కోసం ప్రతి నెల ఎదురు చూస్తుంటారు.

Hyderabad: రెండో శనివారం అంటే ఎవరికైనా ఇష్టమే.. ఎందుకంటే సెకండ్ శాటర్ డే, తర్వాత సండే రెండు రోజులు వరుసగా సెలవులు కలసి వస్తాయి.. అందుకే విద్యార్థులు, పలువు ఉద్యోగులు రెండో శనివారం కోసం ప్రతి నెల ఎదురు చూస్తుంటారు.

సాధారణంగా మన దేశంలో రెండో శనివారం విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రొఫెషనల్ ఇన్ స్టిట్యూట్స్ పలు కార్పోరేట్ సంస్థలకు సెలవులు ఇస్తుంటారు. ఇది బ్రిటీష్ కాలం నాటి నుంచి వస్తుంది. ప్రతి నెల రెండో శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రెండు రోజులు సెలవు కావడంతో చాలా మంది ఉద్యోగులు ఎన్నో రకాల ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యమైన పనులు చక్కబెట్టుకుంటారు. ఇక విద్యార్థులకైతే రెండు రోజులు పండగే. మరికొంత మంది రెండు వారలు పనిచేసి మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు.. రిలాక్స్ కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. తాజాగా తమకు రెండో శనివారం సెలవు ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ప్రతి నెల రెండో శనివారం సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ (TPTLF) ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యకు వినతీ పత్రం అందజేశారు. ప్రతిరోజూ 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్న తమకు శారీక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి పెరిగిపోతుందని దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు అంటున్నారు.ఇకపై తమకు కూడా రెండో శనివారం సెలవు ఇవ్వాల్సిందే అని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ జునుగారి తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

భారత దేశంతో సహా పలు దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు ప్రతినెల రెండో శనివారం సెలవు ఇస్తుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఉద్యోగస్తులకు వరుసగా రెండు రోజులు సెలవు కావడం వల్ల రిలాక్స్ అవుతారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. ఈ రెండో శనివారం సెలవు వెనుక ఓ పెద్ద కథే ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటీష్ ఆఫీసర్ వద్ద ఓ వ్యక్తి నిజాయితీగా పని చేసేవాడు. అతను తన తల్లిదండ్రులకు కలిసేందుకు సెలవు రోజున తన తల్లిదండ్రులను కలిసేందుకు ఊరికి వెళ్లేవాడు. కొన్నాళ్లకు పని ఒత్తిడి కారణంగా ఇంటికి వెళ్లడం మానివేశాడు. దీంతో కొడుకుపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు బ్రిటీష్ ఆఫీసర్ వద్దకు వచ్చి తమ కొడుకు గురించి చెప్పారు. అది విన్న బ్రిటీష్ ఆఫీసర్ ఆ ఉద్యోగి నిబద్దత, నిజాయితీకి మెచ్చి ప్రతి నెల రెండో శనివారం సెలవు తీసుకో అని చెప్పాడట. దాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. అప్పటి నుంచి భారత్ లో కొన్ని విభాగాల్లో రెండో శనివారం సెలవు ఇస్తున్నారు.

 

Show comments