హైదరాబాద్ వాసులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. పర్యాటకులు ఫుల్ ఖుషీ!

CM Revanth Reddy Key Decisions: రాష్ట్ర సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

CM Revanth Reddy Key Decisions: రాష్ట్ర సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడమే కాదు.. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారు. మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ‘హైడ్రా’ రంగంలోకి దింపి అక్రమ కట్టడాలనుకూల్చివేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో బౌద్ద పర్యాటక స్థలాలను అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో హుస్సెన్ సాగర్ బుద్ద విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ది చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ట్యాంక్ బండ్, తెలంగాణ అమర జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ మెంట్ చేయాలని కీలకనిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని భవిష్యత్ లో వరల్డ్ క్లాస్ టూరీజం హబ్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. టూరీజంపై మంచి అవగాహన, అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు, నిపుణులతో నమూనాలు డిజైన్లు తయారు చేయాలని సూచించారు. భవిష్యత్ లో హైదరాబాద్ ఓ అద్భుతమైన టూరీజం ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Show comments