Dharani
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
Dharani
మనిషి పుట్టే సమయం చెప్పగలమేమో కానీ.. చనిపోయే వేళను ఎవరు గుర్తించలేరు. అనూహ్యంగా వచ్చి పలకరించి.. తనతో పాటు తీసుకెళ్తుంది మృత్యువు. అప్పటి వరకు మన కళ్ల ముందు కనిపించిన వ్యక్తి.. నిమిషాల వ్యవధిలో మాయం అవుతాడు. ఇక ఎన్నటికి కనిపించనంత దూరం వెళ్తాడు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఆస్పత్రిలో చేరి.. ఇబ్బంది పడుతూ మృతి చెందిన వారి విషయంలో ఈ బాధ కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి.. ఉన్నట్లుండి.. మృత్యువాత పడితే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి మన జీవితం సరిపోతుంది. ఇక తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాపం ఇంత దారుణంగా మృత్యువాత పడతానని అతడు కూడా ఊహించి ఉండడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
నిన్నటి వరకు ఎండ వేడితో అల్లాడిన జనాలకు.. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలతో కాస్త ఊరట లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ఇక భాగ్యనగరం జోరు వానలో తడిసి ముద్దయ్యింది. ఈ వర్షం వల్ల వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అంతులేని విషాదం కూడా చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి చెందగా.. బేగంపేట నాళాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇక మంగళవారం నాడు మరో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కరెంట్ పోల్‌కి తాకి చనిపోయాడు. సెకన్ల వ్యవధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయ్యో పాపం.. ఇలా కూడా చనిపోతారా అనుకుంటున్నారు జనాలు.
హైదరాబాద్, దూద్‌బౌలికి చెందిన ఫక్రు(40) అనే వ్యక్తి కరెంట్ పోల్‌కి తగిలి.. షాక్ కొట్టి కన్నుమూశాడు. సెకన్ల వ్యవధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రోడ్డు దాటుతున్న ఫక్రు.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలాడు. వెంటనే షాక్ కొట్టి కుప్ప కూలాడు. కింద పడిపోయి చనిపోయాడు.
అతడిని గమనించిన స్థానికులు.. తాగి పడిపోయాడని భావించి పట్టించుకోలేదు. కానీ అతడిలో ఎంత సేపటికి కదలికలు లేకపోవడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా.. అప్పటికే అతడు చనిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో చూసిన వారు.. పాపం ఇలా చనిపోతానని ఆ వ్యక్తి కల్లో కూడా ఊహించి ఉండడు అంటున్నారు.
Be careful, stay away from #ElectricityPole during rain.#CCTv : A man died of electrocution after he touched an electricity pole, during heavy rains, near Bahadurpura ‘X’ road in Hyderabad.#HyderabadRains #Hyderabad #Electrocution #ElectricShock pic.twitter.com/jDB5Jr7IxA
— Surya Reddy (@jsuryareddy) May 7, 2024