Arjun Suravaram
నూతన సంవత్సర వేడుకలకు దేశ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో న్యూయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకలకు దేశ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో న్యూయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు.
Arjun Suravaram
2023 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి అందరూ సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యూయర్ వేడుకలను ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని చాలా మంది అనేక ప్రణాళికలు వేసుకుంటారు. దానికి అనుగుణంగా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారి ప్లాన్ చేసుకుంటారు. అలానే హైదరాబాద్ నగరంలో కూడా న్యూయర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సిటీ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ఒక్కరు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అనేక రకాల ప్లాన్ తో సిద్ధంగా ఉంటారు. ఇక అనేక రకాల ఈవెంట్స్ కూడా డిసెంబర్ 31 రోజున జరుగుతుంటాయి. ఇలా న్యూయర్ వచ్చిన ప్రతి సారి.. పోలీసులు సైతం కొన్ని ఆంక్షలు విధించడం మామూలే. తాజాగా హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1.00 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు పరిష్మన్ ఇచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నూతన సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త సంవత్సర వేడుకలస సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. న్యూయర్ సందర్భంగా జరుపుకునే వేడుకలను రాత్రి 1.00 గంట వరకే జరుపుకోవాలని సూచించారు. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, అదే విధంగా ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే ఆయన తెలిపారు. అదే విధంగా పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పబ్బుల్లో డాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయకూడదని.. డ్రగ్స్, గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంటుందని సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలానే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని సూచించారు. ఈవెంట్స్ లో సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వకూడదని.. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దని తెలిపారు. మద్యం సంబంధిత ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి అనుమతి లేదు.
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు.. ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారికి పోలీసులు పలు సూచనలు చేస్తూ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లేదంటే న్యూ ఇయర్ రోజున ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.