P Krishna
నేటి సమాజంలో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఎదుటి వారిని మోసం చేస్తూ ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఆహారం, పాలు, మెడిసన్స్ అన్నింటిలో కల్తీ చేస్తున్నారు.
నేటి సమాజంలో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఎదుటి వారిని మోసం చేస్తూ ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఆహారం, పాలు, మెడిసన్స్ అన్నింటిలో కల్తీ చేస్తున్నారు.
P Krishna
ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారుల్లో వెళ్తున్నారు. ఇందుకోసం ఎదుటి వారి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నకిలీ దందా బాగా పెరిగిపోయింది. ఆహార పదార్థల నుంచి మొదలు ఆరోగ్యాన్ని కాపాడే మెడిసెన్స్ వరకు ఎక్కడ చూసినా నకిలీ దంగా కొనసాగుతుంది. ఇలాంటి నకిలీ దందాలు చేసేవారిని పోలీసులు పట్టుకుంటున్నా.. ఎలాగో అల బయటపడి మళ్లీ అదే పాడు పనులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇల్లీగల్ గోడౌన్ లపై డీసీఏ అధికారులు రైడ్ చేసి లక్షల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నకిలీ మందులు తయారు చేస్తున్నారన్న విషయం గురించి పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంబర్ పేట్ లో పరిమిషన్ లేని పలు గోదాములపై గురు, శుక్రవారాల్లో దాడులు చేసి దాదాపు రూ.20.52 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు అక్రమంగా అమ్మడానికి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆజాద్ నగర్ లోని అలీ కేఫ్ కు సమీపంలో డ్రగ్స్ లైసెన్స్ లేకుండా ఎండీ బషీర్ అహ్మద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న గోదాంలో ఈ నకిలీ మెడిసన్స్ గుర్తించారు డీసీఏ డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్లు. అక్కడ కార్డు బోర్డ్ షిప్పర్ కార్టన్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ మెడిసన్స్ లో పీడియాట్రిక్ సిరప్, యాంటీ అల్సర్ డ్రగ్, జనరేషన్ యాంటీ బయాటిక్స్, యాంటీ మలేరియా, అనాల్జెసిక్ డ్రగ్స్, యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు ఉన్నాయి. గౌడౌన్ లో స్వాధీనం చేసుకున్న మెడిసిన్ ప్యాక్ లేబుల్స్ పై ‘యాష్లే ఫార్మాటెక్ ప్రైవేల్ లిమిటెడ్’ అని పేరు ఉన్నట్లు డీసీఏ అధికారులు తెలిపారు. అంతేకాదు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో తయారీదారుల వివరాలు కూడా ఉన్నాయని అన్నారు. అంతేకాదు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో స్ట్రేడ్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన అజిత్రో మైసిన్ టాబ్లెట్స్ ఐపీ – 500 ఎంజీ మందులు కూడా లభ్యం కాగా.. వాటిని కూడీ సీజ్ చేశారు డీసీఏ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే మెడిసన్స్ ఏ ఇతర సంస్థలు తయారు చేయవని, ప్రభుత్వం జారీ చేసిన డ్రగ్స్ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచితే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాం ఉంటుందని డీసీఏ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. కేవలం డబ్బు సంపాదన కోసం ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.