Hyderabad Bullet Bike Explosion Moghalpura: వీడియో: పేలిన బుల్లెట్‌ బైక్‌.. మంటల్లో కాలిపోయిన కానిస్టేబుల్‌

Hyderabad: వీడియో: పేలిన బుల్లెట్‌ బైక్‌.. మంటల్లో కాలిపోయిన కానిస్టేబుల్‌

హైదరాబాద్‌లో బుల్లెట్‌ బైక్‌ పేలడం.. తీవ్రంగా పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో బుల్లెట్‌ బైక్‌ పేలడం.. తీవ్రంగా పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఆ వివరాలు..

బుల్లెట్‌ బైక్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక గత ఐదేరేళ్లుగా బుల్లెట్‌ బండ్ల వాడకం పెరుగుతోంది. ఇక ఇప్పుడైతే బైక్‌ కొందామనుకునే వారిలో ఎక్కువ శాతం మంది బుల్లెట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక భాగ్యనగరంలో బుల్లెట్‌ బండ్ల సంఖ్య బాగా పెరిగింది. యువతలో ఇంత క్రేజ్‌ ఉన్న బుల్లెట్‌ బైక్‌.. ఓ చోట మాత్రం పెను విషాదం సృష్టించింది. బుల్లెట్‌ బైక్‌ పేలడంతో సుమారు పది మంది గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌, ఓల్డ్‌ సిటీలో వెలుగు చూసింది. డ్రైవింగ్‌లో ఉన్న బుల్లెట్‌ బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. ఆ వివరాలు..

ఎన్నికల సందర్భంగా.. ఓల్డ్ సిటీలోని మొఘల్ పురా పీఎస్ పరిధిలో ఎఫ్ఎస్టీ టీమ్ ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే భవానీనగర్ లోని అక్బర్ ఫంక్షన్ హాల్ వైపు నుంచి వెళ్తున్న బుల్లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎలక్షన్ టీమ్‌కు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం గమనించిన వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అక్కడున్న 10 మందికి మంటలు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న జహనుమాకు చెందిన షౌకత్‌కు 90 శాతం గాయాలు అయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌కు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరం ముందు భాగం అంతా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన పక్కనే ఉన్న వ్యక్తులు కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ సందీప్, ప్రయివేట్ వీడియో గ్రాఫర్ గౌస్ రెహమాన్ తో పాటు బుల్లెట్ సమీపంలోని శంషాబాద్ కు చెందిన ఖాజా పాషా, మలక్ పేట్ కు చెందిన అబ్దుల్ రహీమ్, తలాబ్ కట్టకు చెందిన సౌద్, మహమ్మద్ హుస్సేన్,షేక్ ఖదీర్,షేక్ అజీజ్, సంతోష్ నగర్ కు చెందిన మహమ్మద్ నదీమ్​ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మొఘల్‌పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు.

Show comments