Ayodhya Rama Mandir- Laddu From HYD: రాములోరికి నైవేధ్యంగా హైదరాబాద్ నుంచి లడ్డు.. ఏకంగా 1265 కిలోలతో..!

రాములోరికి నైవేధ్యంగా హైదరాబాద్ నుంచి లడ్డు.. ఏకంగా 1265 కిలోలతో..!

Huge Laddu Fro Ayodhya From Hyderabad: అయోధ్య రామ మందిరానికి భాగ్యనగరం నుంచి ప్రసాదం అందనుంది. అందుకోసం భారీ లడ్డుని తయారు చేశారు.

Huge Laddu Fro Ayodhya From Hyderabad: అయోధ్య రామ మందిరానికి భాగ్యనగరం నుంచి ప్రసాదం అందనుంది. అందుకోసం భారీ లడ్డుని తయారు చేశారు.

ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రామయ్య సన్నిధి ఆసక్తికర అంశంగా మారింది. జనవరి 22న అంగరంగవైభవంగా అతిరథ మహారధుల సమక్షంలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది. కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రత్యేక అహ్వానం అందనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామతీర్థ ట్రస్టు వారు ఎంపిక చేసిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందజేస్తన్నారు. దేశ, విదేశాల నుంచి ఉన్న రామ భక్తులు అయోధ్యకు విరాళాలు పండమే కాకుండా, బహుమతులు కూడా పంపుతున్నారు. అలా చేయడం వల్ల తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న కేటరర్స్ కు అరుదైన అవకాశం దక్కింది. ఆ రామయ్యకు నైవేధ్యం తయారు చేసే ఛాన్స్ పొందారు.

అయోధ్య రామయ్యకు ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోయిందని భావిస్తున్న తరుణంలో.. హైదరాబాద్ కు చెందిన కేటరర్స్ కు మాత్రం అరుదైనా అవకాశం దక్కింది. ఏకంగా అయోధ్య రామయ్యకు నైవేధ్యం చేసి పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రామయ్యకు నైవేధ్యంగా లడ్డు తయారు చేసే అవకాశాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని శ్రీరామ్ కేటరర్స్ కు కల్పించారు. అందుకు సంబంధించిన అనుమతులను లేఖ రూపంలో శ్రీరామ్ కేటరర్స్ కు పంపారు.

రామాలయం భూమిపూజ నుంచి ప్రాణప్రతిష్ట వరకు ఎన్నిరోజులు అయితే అన్ని రోజులకు రోజుకు ఒక కిలో చొప్పున బారీ లడ్డు తాయరు చేయాలని శ్రీరామ్ కేటరర్స్ మొక్కుకున్నారు. అదే విషయాన్ని శ్రీరామ తీర్థ ట్రస్టుకు తెలియజేశారు. పది రోజుల క్రితం ట్రస్టు నుంచి శ్రీరామ్ కేటరర్స్ కు అనుమతులు ఇస్తూ లేఖను పంపారు. వెంటనే శ్రీరామ్ కేటరర్స్ లడ్డూని తయారు చేశారు. మొత్తం 1265 కిలోల భారీ లడ్డూని తయారు చేశారు. ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వును వినియోగించినట్లు శ్రీరామ్ కేటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డుకు ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపుతారు.

ఈ భారీ లడ్డుకు తోడు మరో 5 చిన్న లడ్డూలను వీళ్లు తయారు చేస్తున్నారు. వాటిని పూజా సామాగ్రితో పాటుగా అయోధ్య రామయ్యకు నైవేధ్యంగా సమర్పించనున్నారు. ఈ భారీ లడ్డూని అయోధ్య రామయ్య మందిరానికి కేవలం 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని చెప్పారు. అక్కడికి వచ్చే భక్తులకు ఈ లడ్డూని ప్రసాదంగా వితరణ చేయనున్నారు. జనవరి 21న ఈ భారీ లడ్డు అయోధ్యకు చేరుకుంటని తెలియజేశారు. ఇప్పటికే అయోధ్య రామమందిరానికి హైదరాబాద్ నుంచి తలుపులు, పాదుకలు తయారై వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు నైవేధ్యం రూపంలో కూడా భాగ్యనగరం భాగం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి నైవేధ్యం వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments