అయ్య బాబోయ్ HYD హోటల్స్.. మొన్న ఫుడ్.. ఈ రోజు లిఫ్ట్

ఓ హోటల్లో ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అది నాల్గవ ఫ్లోర్ కావడంతో లిఫ్టు నుండి రాకపోకలు సాగిస్తున్నారు ఆ వేడుకకు హాజరౌతున్న అతిధులు. కార్యక్రమాన్ని ముగించుకుని లిఫ్టు నుండి కిందకు వెళదామని ఇలా ఎక్కారు కొంత మంది.. అంతే..

ఓ హోటల్లో ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అది నాల్గవ ఫ్లోర్ కావడంతో లిఫ్టు నుండి రాకపోకలు సాగిస్తున్నారు ఆ వేడుకకు హాజరౌతున్న అతిధులు. కార్యక్రమాన్ని ముగించుకుని లిఫ్టు నుండి కిందకు వెళదామని ఇలా ఎక్కారు కొంత మంది.. అంతే..

హైదరాబాద్ హోటల్స్ అయ్య బాబోయ్ అంటున్నారు జనాలు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో నాసిరకం వస్తువులు, కుళ్లిన చికెన్, అవుట్ డేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్, కల్తీ సరుకులతో వంటలు చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారని తేలింది. చిన్న చిన్న హోటల్సే కాదు.. పేరు మోసిన రెస్టారెంట్లలో సైతం ఇదే తీరును చూసి.. భాగ్య నగరి వాసులు.. ముఖ్యంగా బ్యాచులర్స్ నివ్వెరపోయారు. బయట నుండి ఆర్డర్స్ చేసుకునే ఫ్యామిలీ మెన్ అండ్ ఉమెన్ కూడా వీటి నిర్వాకం చూసి వాంతి చేసుకున్నంత పని చేశారు. మళ్లీ ఎప్పుడు వాటికి జోలికి వెళ్లకూడదనేలా చేసుకున్నాయి కొన్ని ఫుడ్ సెంటర్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడో హోటల్ .. నిర్వాహణ లోపం బయటకు వచ్చింది.. తృటిలో కొంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎక్కడో అదృష్టం బాగుండి గాయాలతో బయటపడ్డారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ ప్రముఖ హోటల్‌లో లిఫ్టు నాలుగో అంతస్తు నుండి సెల్లార్‌లో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగోల్‌లోని కినరా గ్రాండ్ హోటల్లో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. ఆదివారం ఆ హోటల్‌లో ఓ వివాహ నిశ్చితార్ధ వేడుక జరుగుతుంది. ఆ కార్యక్రమం నాలుగో అంతస్తులో ఏర్పాటైంది. దీంతో ఆ వేడుకకు తరలివచ్చిన చిన్నా, పెద్ద అంతా ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కోసం లిఫ్టును వినియోగిస్తున్నారు. నాలుగో అంతస్థులో ఆగిన లిఫ్టు నుండి కిందకు దిగేందుకు ఎనిమిది మంది అందులోకి ఎక్కారు. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా లిఫ్టు ఒక్కసారిగా కుప్పకూలి సెల్లార్‌లో పడిపోయింది. లిఫ్టు ఎక్కిన 8 మందికి గాయాలయ్యాయి.

ఎంగేజ్ మెంట్ వేడుకకు వచ్చిన మిగిలిన బంధువులు యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో.. లిఫ్టు తలుపులు తెరిపించి.. గాయపడిన వారిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సాజిద్ బాబా, రవిశంకర్ రెడ్డి, వీర భద్రం, మణికంఠ గుప్తా, కళ్యాణ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ లోపం కారణంగానే లిఫ్టు కూలిందంటూ బాధితుల ఫిర్యాదు మేరకు నాగోలు పోలీస్ స్టేషన్‪లో కినరా హోటల్ మేనేజ్ మెంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పరిమితికి మించి ఎక్కారని, అందువల్లే లిఫ్టు కూలిపోయిందని యాజమాన్యం వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీని బట్టి చూస్తే హోటల్ ఫుడ్ వల్లే కాదు లిఫ్టుల వల్ల కూడా ప్రాణాలకు పెను ముప్పు పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది.

Show comments