iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాలు కింద తెలుసుకోండి.

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాలు కింద తెలుసుకోండి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు

 విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ను వచ్చింది. రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 30న ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో నవంబర్ 29, 30 వరుసగా రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలోనే ఈ నెల 29న పోలింగ్ కేంద్రాల వద్ద అధికారలుు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక 30న తారిఖున ఓటింగ్ జరగనుండడంతో అంతా ఓటింగ్ లో పాల్గొంటారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఇక ఓటింగ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల మాత్రం ఓటర్లకు మద్యం పంపిణీ చేయడంతో పాటు అనుమానం రాకుండా డబ్బును కూడా పంచుతున్నట్లు సమాచారం.

దీంతో ప్రజలు కూడా ఎవరు ఇచ్చినా మద్యం, డబ్బును తీసుకుంటున్నారు. ఇక ఓటింగ్ ముందు రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే, ఎన్నికల అధికారులు సైతం పోలింగ్ బూత్ లకు చేరుకోనున్నారు. ఓటింగ్ ముందు రోజే నుంచి కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, 29న స్కూల్స్ లో పోలింగ్ బూత్ లు ఏర్పాట్లు చేయడం, 30న ఓటింగ్ జరగనుండడంతో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక డిసెంబర్ 1న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకుంటాయని అన్నారు.