Heavy rain in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..!

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..!

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, బెగంపేట్, హుసెన్ సాగర్, అశోక్ నగర్, ముషిరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా వరద నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతే కాకుండా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

ఇక జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆఫీసు నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయానికి వర్షం పడడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక వాతావరణశాఖ అధికారులు సైతం స్పందించారు. తెలంగాణలో మరో రెండు, మూడో రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. ఇక గణేశుడి నిమజ్జనానికి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

  • ఇది కూడా చదవండి: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు!
Show comments