ప్రముఖ బేకరీలో దారుణం.. బ్రెడ్ తింటుండగా చిత్తు కాగితాలు, వెంట్రుకలు

Hair, Scrap Papers In Famous Bakery Bread: బయట ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నాణ్యత లేని ఫుడ్ తినడం ఒక బాధ అయితే.. ఏ ఫుడ్ తింటే ఏ పురుగు వస్తుందో అని.. ఏ చెత్త తగులుతుందో అని భయం భయంతోనే బతికే పరిస్థితి. తాజాగా ప్రముఖ బేకరీలో బ్రెడ్ లో చిత్తు కాగితాలు, వెంట్రుకలు బయటపడ్డాయి.

Hair, Scrap Papers In Famous Bakery Bread: బయట ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నాణ్యత లేని ఫుడ్ తినడం ఒక బాధ అయితే.. ఏ ఫుడ్ తింటే ఏ పురుగు వస్తుందో అని.. ఏ చెత్త తగులుతుందో అని భయం భయంతోనే బతికే పరిస్థితి. తాజాగా ప్రముఖ బేకరీలో బ్రెడ్ లో చిత్తు కాగితాలు, వెంట్రుకలు బయటపడ్డాయి.

బయట ఫుడ్ తినాలంటే జనం వణికిపోతున్నారు. హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో కల్తీ ఆహార పదార్థాలు వాడుతూ కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారు. దీనికి తోడు తినే ఫుడ్ లో బల్లులు, ఈగలు, బొద్దింకలు వంటివి తారసపడుతున్నాయి. కనీస శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తరచూ దాడులు చేస్తున్నారు. అయినా గానీ రెస్టారెంట్ యాజమాన్యాల తీరు మారడం లేదు. ఇంకా ఇలాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య హాస్టల్ లో కల్తీ ఫుడ్ తయారు చేస్తూ పట్టుబడడం.. దాన్ని అధికారులు సీజ్ చేయడం చూశాం. ఆ తర్వాత ప్రముఖ హోటల్స్ కనీస నియమాలు పాటించకపోవడం వల్ల వాటిని సీజ్ చేయడం చూశాం.

ఇలా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా మిగిలిన వారిలో భయం కలగడం లేదు. తీసుకున్న డబ్బుకు కస్టమర్ కి రుచికరమైన, శుచికరమైన ఫుడ్ అందించాలి. అందించకపోగా క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఇలానే ఉంటుంది.. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడతారు. కల్తీ లేకుండా మంచి ఫుడ్ ఎలాగూ పెట్టరు. కనీసం శుభ్రంగా, రుచిగా అయినా వండి పెట్టకపోతే ఎలా? రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ బేకరీలో బ్రెడ్ కొనుక్కున్న కస్టమర్ కి బ్రెడ్ తో పాటు వెంట్రుకలు, చిత్తు కాగితాలు వచ్చాయి.

నార్సింగి పరిధిలోని మోరిన్ బేకరీలో ఓ కస్టమర్ బ్రెడ్ కొనుగోలు చేశాడు. ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ లో వెంట్రుకలు, చిత్తు కాగితాలు బయటపడ్డాయి. కస్టమర్ ఈ బ్రెడ్ తింటుండగా వెంట్రుకలు నోటిలోకి వెళ్లాయి. నోటిలో ఏదో అడ్డుకుందని చూడగా వెంట్రుకలు చూసి షాక్ అయ్యాడు. విషయం మీడియా వరకూ వెళ్లడంతో బేకరీ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా మోరిన్ బేకరీపై స్థానికులు మండిపడుతున్నారు. పేరుకే ఫేమస్ అని.. ఫుడ్ విషయంలో నాణ్యత లేదని చెబుతున్నారు. బేకరీపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

Show comments