iDreamPost
android-app
ios-app

అంత్యక్రియల్లో అపశృతి.. గాల్లోకి కాల్పులు జరపడానికి ముందే పేలిన తుపాకీ

  • Published Sep 23, 2023 | 7:39 PM Updated Updated Sep 23, 2023 | 7:39 PM
  • Published Sep 23, 2023 | 7:39 PMUpdated Sep 23, 2023 | 7:39 PM
అంత్యక్రియల్లో అపశృతి.. గాల్లోకి కాల్పులు జరపడానికి ముందే పేలిన తుపాకీ

ఈ మధ్యకాలంలో తుపాకీ మిస్ ఫైర్ ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపంతోనే, మానవ తప్పిదంతోనే గన్ మిస్ ఫైర్ అయి అధికారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ రోజు పరిగి మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశాలతో అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. పోలీస్ చేతిలోని తుపాకీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పితో బాధ పడుతున్న ఆయనను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పరిగిలో నిర్వహించారు. కాగా ఈ అంత్యక్రియల్లో అపశృతి చోటుచేసుకుంది. అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణంలో పోలీస్ చేతిలోని తుపాకీ పేలింది. గాల్లోకి కాల్పులు జరపడానికి ముందే గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ కూడా ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు పోలీసులు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet