iDreamPost
android-app
ios-app

టీచర్లు ఇదేం పని.. మహిళా స్వీపర్లను వివస్త్రలను చేసి దారుణం!

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆ స్కూల్లో స్వీపర్లుగా పని చేస్తున్న ఇద్దరు మహిళలపై దొంగతనం చేశారని ఆరోపిస్తూ వివస్త్రలను చేసి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆ స్కూల్లో స్వీపర్లుగా పని చేస్తున్న ఇద్దరు మహిళలపై దొంగతనం చేశారని ఆరోపిస్తూ వివస్త్రలను చేసి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

టీచర్లు ఇదేం పని.. మహిళా స్వీపర్లను వివస్త్రలను చేసి దారుణం!

గొప్ప చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ సంస్కార హీనులుగా ప్రవర్తించారు ప్రభుత్వ టీచర్లు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమసమాజ స్థాపనకు పాటుపడాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లు అసభ్యంగా ప్రవర్తించారు. సమాజంలో గురువులను దైవంలా భావిస్తారు. కానీ కొందరి టీచర్ల ప్రవర్తన ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చలా మారింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా స్వీపర్ల పట్ల టీచర్లు అమానుషంగా ప్రవర్తించారు. వారిపై దొంగతనం నేరం మోపి విస్త్రలను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆ స్కూల్లో స్వీపర్లుగా పని చేస్తున్న ఇద్దరు మహిళలపై దొంగతనం చేశారని ఆరోపిస్తూ వివస్త్రలను చేసి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఊహించని ఘటనతో మహిళా స్వీర్లకు తీవ్ర అవమానం జరిగింది. దీంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి స్కూల్ ముందు నిరసనకు దిగారు. అసలు ఏం జరిగిందంటే? జ్యోతిరావు పూలే పాఠశాలలో పద్మ, సుశీల అనే ఇద్దరు మహిళలు స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయడం, పాఠశాల ఆవరణాన్ని క్లీన్ చేయడం, టీచర్లకు టీ అందించడం చేస్తుంటారు.

అయితే నిన్న( మంగళవారం) రోజు మాదిరిగానే స్కూల్ కు వచ్చి వారి పనుల్లో నిమగ్నమైపోయారు మహిళా స్వీపర్లు. కాగా ఈ స్కూల్లో గెస్ట్ టీచర్ గా పని చేస్తున్న శ్రీలేఖ అనే ఉపాధ్యాయురాలు తన హ్యాండ్ బ్యాగ్ ను టీచర్ల గదిలో పెట్టి క్లాస్ కు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి వచ్చిన శ్రీలేఖ తన బ్యాగులో ఉన్న రూ. 4 వేలు ఎవరో దొంగిలించినట్లు గుర్తించింది. వెంటనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ఎంత వెతికినా డబ్బు దొరకపోవడంతో స్వీపర్లే కాజేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉండే మాంత్రికుడితో పసుపు నీరు మంత్రించి స్వీపర్లకు తాగించారు. అయినా దొంగ ఎవరనేది బయటపడలేదు.

ఈ క్రమంలో సాయంత్రం అవడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు స్వీపర్లు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ ఆదేశాలతో వారిని అడ్డగించి విస్త్రలను చేసి తనిఖీలు చేపట్టారు టీచర్లు. మేము ఆ డబ్బులు తీసుకోలేదని ఎంత చెప్పినా వినకుండా టీచర్లు దారుణంగా వ్యవహరించారు. తమపై దొంగతనం మోపి తనిఖీలు చేపట్టడంతో తీవ్ర అవమానానికి లోనైన పద్మ, సుశీల కుటుంబ సభ్యులతో కలిసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో పని చేస్తున్నాము. మేము ఏవిధమైన తప్పు చేయలేదని మహిళా స్వీపర్లు కన్నీరు పెట్టుకున్నారు. టీచర్లపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.