చరిత్రలో జరిగే కొన్ని అద్భుతాలను మనం నమ్మలేం. అలా నమ్మలేని అద్భుతాలు ఎన్నో ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. ఇక వాటి గురించి తెలిస్తే మనం షాక్ అవ్వక తప్పదు. అలాంటి షాకింగ్ ఘటనే తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే రోజు.. ఒకే ఆస్పత్రిలో ఏకంగా 32 ప్రసవాలు జరిగాయి. రాష్ట్రంలోనే ఇది రికార్డుగా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అది కూడా ప్రభుత్వ ఆస్పత్రి కావడం విశేషం. ఈ అద్భుతం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో శనివారం ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఈ ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 32 ప్రసవాలు జరిగాయి. వీటిలో 17 నార్మల్ డెలివరీలు కాగా.. 15 ఆపరేషన్లు ఉన్నాయి. ఇక ఈ డెలివరీల్లో 20 మంది మగ, 12 మంది ఆడ శిశువులు జన్మించారు. ఇందులో 13 మందికి తొలి కాన్పులు కాగా.. వారిలో 9 మందికి నార్మల్ డెలివరీ జరగడం విశేషం. గతంలో ఈ మాతాశిశు కేంద్రంలోనే ఒకే రోజు 29 ప్రసవాలు జరిగగా.. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించామని వైద్యుల బృందం తెలిపింది. ఇలాంటి ఘటనలే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాలని పెంచుతాయని ఆస్పత్రి పర్యవేక్షకులు నరేందర్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా.. వైద్యులను, సిబ్బందిని ఆయన అభినందించారు. మరి అద్భుతమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ! వాటి కోసం సిఫార్స్ లేఖలు..