TS: నగరవాసులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ సమస్యలపై CM రేవంత్ ఫోకస్!

నగరంలో పట్టి పీడుస్తున్న ట్రాఫిక్ సమస్యలు వీడడంలేదు. ఎక్కడికక్కడ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడం, రోడ్లంతా రద్దీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ ఓ మంచి శుభవార్తను అందించింది. అదేమిటంటే..

నగరంలో పట్టి పీడుస్తున్న ట్రాఫిక్ సమస్యలు వీడడంలేదు. ఎక్కడికక్కడ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడం, రోడ్లంతా రద్దీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ ఓ మంచి శుభవార్తను అందించింది. అదేమిటంటే..

భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు వీడడంలేదు. చాలమంది వాహనదారులు తమ గమ్యం చేరేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ లో కాలేజ్ లకు స్కూల్లకు, ఆఫీసులకు వెళ్లలంటే చుక్కలు కనిపిస్తాయి. రాను రాను ఈ మహనగరంలో రోడ్ల మీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతుంది. కనీసం నడవడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పాడుతుంది. ఇలా నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై వర్షం పడితే ఇక వహనదారుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపుల్, మేహదీపట్నం, మసాబ్ ట్యాంక్, అసెంబ్లీ, హిమయత్ నగర్ తదితర ప్రాంతల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఇలా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా సమస్య తలెత్తి వాహనాలు ఆగిపోతే చాలు.. ఇక వాటి వెనకేలా వందలాది వాహనాలు నిలిచిపోతాయి. దాదాపు గంటల తరబడి ఆ ట్రాఫిక్ లో వేచివుండలసిన పరిస్థితి నెలకొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ సర్కార్ మండిపడ్డారు. అతి త్వరలోనే  నగరంలోని వాహనాదారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇంతకి ఏం జరిగదంటే..

నగరంలో పట్టి పీడుస్తున్న ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ సీఎం మండిపడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడం, రోడ్లంతా రద్దీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తరుచు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోతుంది. వీటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు ఈ ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో శనివారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారుల సలహాలు, సూచనలతో నగరంలోని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు పోలీసు యంత్రాంగం ప్రారంభించింది.

అలాగే గతేడాది ఆగస్టులో జరిగిన 64వ కన్వర్షన్ సమావేశానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే.. రోడ్లపై ఆక్రమణలు, పార్కింగ్, రద్దీగా ఉండే రోడ్లపై ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు, అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణం, చెత్త డంపింగ్ వంటి ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యే అంశాలను చర్చించారు. దీంతో పాటు రోడ్ల విస్తరణకు వీలైయ్యే ఆవకాశాలను పరిశీలించారు. ఇక రద్దీ రోడ్లపై అక్రమణలను తొలగించే చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. కాగా, నీటిపనులు, విద్యుత్ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు తవ్వకం, పూడికతీత పనులపై దృష్టి సారించాలని సూచించారు. చివరిగా వాహనదారులకు ట్రాఫిక్ వలన అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా ముందుకు నడవలని ప్రణాళికను రూపొందించారు.

కాగా, ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్, జీహెంచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తదితర శాఖల అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, యాద్రాది, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, మెట్రోరైలు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు , ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. మరి, నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సీఎం తీసుకున్న ప్రత్యేక దృష్టి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments