iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ ప్రజలకి శుభవార్త! CM ఆదేశాలతో ఆ సమస్యపై ఆమ్రపాలి స్పెషల్ ఫోకస్!

  • Published Aug 03, 2024 | 7:53 PM Updated Updated Aug 03, 2024 | 7:53 PM

తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి నుంచి అధికారులకు పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నగరంలో సర్కార్ ఆదేశాల మేరకు ఇకపై కమిషనర్ ఆమ్రపాల్ వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి నుంచి అధికారులకు పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నగరంలో సర్కార్ ఆదేశాల మేరకు ఇకపై కమిషనర్ ఆమ్రపాల్ వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు.

  • Published Aug 03, 2024 | 7:53 PMUpdated Aug 03, 2024 | 7:53 PM
హైదరాబాద్ ప్రజలకి శుభవార్త! CM ఆదేశాలతో ఆ సమస్యపై ఆమ్రపాలి స్పెషల్ ఫోకస్!

తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి నుంచి తనదైన విధుల్లో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వాహణ దగ్గర నుంచి, ట్రాఫిక్ సమస్యల వరకు ప్రతి విషయంలో ఫోకస్ పెడుతూ.. ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఓ సాధారణ అమ్మాయిల నగరంలో పలు ప్రాంతల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వాహిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతోపాటు నగరంలోని విద్యార్థులు,యువతతో మాట్లాడుతూ తమ సమస్యలను అడిగి తెలుసుకొని పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రెవంత్ సర్కార్ ఆదేశాల మేరకు కమిషనర్ ఆమ్రపాల్ ఇకపై వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సీఎం రేంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. నగర పరిధిలో ఉన్న చెరువులు పరిరక్షణ, సుందరీకరణపై దృష్టి సారించాలని సర్కార్ కీలక ఆదేశాలను జారీ చేసింది.అంతేకాకుండా.. నగరంలోని చెరువులు కబ్జా కాకుండా చూడాలని, చెరువుల్లో మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే సర్కార్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట.. ఇక నుంచి నగరంలో చెరువులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యలోనే మార్నింగ్ వాక్ సమయంలో కమిషనర్ ఆమ్రపాల్.. పారిశుద్ధ్య పనులతో పాటు ఆయా ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున.. చెరువుల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో ఏమైనా సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే జోనల్ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశించినట్లు తెలిసింది.

Amrapaali

ఇకపోతే నగరంలో హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 2,250 చెరువులు ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 185 చెరువులున్నాయి. అయితే ఈ చెరువులు సుందరీకరణ, పరిరక్షణలో భాగంగా.. ఇప్పటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేయటంతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఈవీడీఎం ఆయా చెరువుల వద్ద సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ చెరువుల్లో మురుగు జలాలు ప్రవహించటం, భవన నిర్మాణ వ్యర్థాలు వేయటం లాంటి చర్యలకు బ్రేక్ పడటం లేదని స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అందుకోసమే జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ చెరువులోకి మురుగు నీరు చేరకుండా చేపట్టాల్సిన చర్యలపై హెల్త్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిపి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఓ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కమిటీ నగరంలోని మొత్తం 185 చెరువులను క్షేత్రస్థాయిలో సందర్శించి.. వాటి వివరాలు సేకరించాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాటు చెరువులకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా, ఒకవేళ లేకుంటే వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని, అలాగే ఫెన్సింగ్ ఉంటే అది ఎంత ధృడంగా ఉందో అనే విషయాలను గమనించాలని ఆదేశించారు. వీటితో పాటు మరో వైపు చెరువుల్లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని,  దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, అపార్ట్‌మెంట్ల నుంచి సీవరేజీ వాటర్ వస్తున్నట్లు గుర్తిస్తే, సదరు భవనం యజమానులకు గానీ, ఫ్లాట్స్ అసోసియేషన్ వారికి ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్ సూచించారు. మరీ, సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కమిషనర్ ఆమ్రపాలి  చెరువుల పై స్పెషల్ ఫోకస్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap