iDreamPost
android-app
ios-app

బిగ్‌ బ్రేకింగ్‌: ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

  • Published Aug 06, 2023 | 3:28 PM Updated Updated Aug 06, 2023 | 3:28 PM
  • Published Aug 06, 2023 | 3:28 PMUpdated Aug 06, 2023 | 3:28 PM
బిగ్‌ బ్రేకింగ్‌: ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్‌ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు. ఇటీవల ఆయన అపోలో ఆస్పత్రిలో గద్దర్‌ గుండె ఆపరేషన్‌ చేయించుకున్నారు. ప్రజా గాయకుడిగా, రచయిత, యుద్ధనౌకగా గద్దర్ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. అయితే ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. గద్దర్ అనే పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన “గదర్ పార్టీ” కి గుర్తుగా పెట్టుకున్నారు. గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్‌లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో పూర్తిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు.

మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి బయటపడిన తర్వాత.. విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ తరపున పంపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్‌ పాత్ర ఎంతో ఉంది. ఆయన రాసి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు’ అనే పాట యావత్‌ తెలంగాణను చైతన్యం చేసింది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetcratosroyalbetmatbet girişjojobetdeneme bonusudeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobetjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibomcasibomjojobetcasibom girişjojobet giriş