కోటి రూపాయలతో కల్యాణ మండపం.. ఉచితంగా వివాహాలు! ఎక్కడంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన వేడుక. అందుకే ఈ కార్యాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో కోటి రూపాయల కల్యాణ మండపం నిర్మించారు. అందులో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంటారు.

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన వేడుక. అందుకే ఈ కార్యాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో కోటి రూపాయల కల్యాణ మండపం నిర్మించారు. అందులో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంటారు.

నేటికాలంలో సమాజం గురించి పట్టించుకునే వారి సంఖ్య తక్కువైంది. చాలా తక్కువ మంది మాత్రమే పరులకు సాయం చేయాలని భావిస్తుంటారు. విద్యా దానం, అన్నదానం, వస్త్రదానం ఇలా అనేక రకాల దానాలు  చేస్తూ పేద వారిని ఆదుకుంటారు. ఇటువంటి సాయాలు చేసే వారు ఎక్కువ మంది ఉంటారు. కానీ పెళ్లిళ్ల విషయంలో పేదలకు సాయం చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది.  అందరికి భిన్నంగా  ఓ వ్యక్తి..కోటి రూపాయలతో పెళ్లి మండపం కట్టించారు.అంతేకాక అందులో పేదల కుటుంబాల వారు వివాహలు జరిపించుకునే అవకాశం కల్పించారు. మరి.. ఆ వ్యక్తి ఎవరు, ఆ పేదల పెళ్లి మండపం ఎక్కడా?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి వ్యక్తితో వివాహం చేయాలని భావిస్తుంటారు. అలానే తమ బిడ్డల వివాహాన్ని చాలా ఘనం నిర్వహించాలని అనుకుంటారు. మరోవైపు కొందరు తల్లిదండ్రులు బిడ్డలకు పెళ్లి చేసే విషయంలో ఆర్థికంగా చాలా నలిగికి పోతుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు..సమాజం కోసం తమ ఆర్థిక స్థోమతకు మించి వివాహలు జరిపిస్తుంటారు. అప్పులు చేసే మరి బిడ్డల వివాహలను జరిపిస్తుంటారు. పెళ్లి మండపల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అదే మండపం ఖర్చు తగ్గితే.. ఆ తల్లిదండ్రులకు సగం పెళ్లి ఖర్చు తగ్గినట్లే. అదే ఆలోచన సందీప్ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి వచ్చింది.

పేద కుటుంబ వారు తమ బిడ్డల పెళ్లిల విషయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దగ్గర నుంచి చూశారు. అందుకే వారికి తనవంతుగా సాయం చేయాలని భావించారు.  మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్  గ్రామానికి చెందిన సందీప్ శ్రీనివాస్ గౌడ్ కోటి రూపాయలతో పెళ్లి మండపాన్ని నిర్మించారు. ఆ గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మి నరహింహ స్వామి వారి దేవాలయంలోఈ కల్యాణ మండపాన్ని నిర్మించారు. తన తండ్రి నరసయ్య గౌడ్ జ్ఞాపకార్థం ఈ మండపాన్ని శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. తన సొంతంగా కోటీ రూపాయలతో ఈ పెళ్లి మండపాన్ని కట్టించారు.

ఈ మండపంలో ఎవరైన ఒక్క రూపాయి చెల్లించకుండా వివాహం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వివాహలు ఈ కోటి రూపాయల కల్యాణ మండపంలో జరిగాయి. పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మండపం ఉంద . కుమార్తెలకు వివాహం చేయడం చాలా మంది తండ్రులకు తలకు మించిన భారమని, అలాంటి వారికి తనవంతుగా సాయం చేస్తున్నాని దాత  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అలానే పుట్టిన ఊరికి ఇలా మండపం నిర్మించి.. తనవంతుగా రుణం తీర్చుకుంటున్నానని ఆయన తెలిపారు.  మొత్తంగా పేద కుటుంబాల వారి కోసం శ్రీనివాస గౌడ్ ఇలాంటి మంచి పని చేయడంతో స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments