P Krishna
T Rajaiah Resignation from BRS: తెలంగాణలో త్వరలో లోక్‌సభ ఎన్నికల జరగబోతున్నాయి.. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి మరో వికెట్ ఔట్ అంటూ వార్తలు వస్తున్నాయి.
T Rajaiah Resignation from BRS: తెలంగాణలో త్వరలో లోక్‌సభ ఎన్నికల జరగబోతున్నాయి.. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి మరో వికెట్ ఔట్ అంటూ వార్తలు వస్తున్నాయి.
P Krishna
ఇటీవల తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ సమయంలో రాజకీయ సమీకరణాలు కూడా బాగానే జరిగాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయ్యారు. మొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై చతికల పడ్డ బీఆర్ఎస్ కి కొంతమంది కీలక నేతలు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మరో దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో కీలక వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్న మాజీ మంత్రి రాజయ్య పార్టీని విడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పంపబోతున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా తనకు పార్టీలో సరైన గౌరవం దక్కకపోవటంతోనే పార్టీని వీడుతున్నట్లు తన సహచరులతో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు పార్టీ టికెట్ కేటాయించకున్నా.. మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేస్తానని అధిష్టానానికి చెప్పినప్పటికీ తనను చిన్న చూపు చూస్తూ పక్కన పెడుతుందని తన కార్యకర్తలతో చెప్పి బాధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టికెట్ కోసం రాజయ్య విఫలయత్నం చేశారు.. కానీ చివరికి అది దక్కలేదు. బీఆర్ఎస్ ఆ టికెట్ కడియం శ్రీహరికి అప్పగించింది. గతంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజయ్యకు రైతు బంధు సమితి చైర్మన్ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి రాజయ్య అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేటీఆర్ కల్పించుకొని ఆయన సమక్షంలో కడియం కి సహకరిస్తానని వాగ్దానం చేయించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ఇంతకాలం మౌనంగా ఉన్న రాజయ్య త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ నుంచి బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు.