iDreamPost
android-app
ios-app

బర్రెలక్క గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కన్న తండ్రి!

  • Published Nov 25, 2023 | 8:14 PM Updated Updated Nov 25, 2023 | 8:14 PM

శిరీష అలియాస్ బర్రెలక్కపై కన్న తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

శిరీష అలియాస్ బర్రెలక్కపై కన్న తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

  • Published Nov 25, 2023 | 8:14 PMUpdated Nov 25, 2023 | 8:14 PM
బర్రెలక్క గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కన్న తండ్రి!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం హాట్ టాపిక్ గా మారింది. దీనికి గల కారణం శిరీష అలియాస్ బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు తాను కోల్లాపూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించి నామినేషన్ దాఖలు చేసింది. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తోంది. బర్రెలక్కకు ప్రజలతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బర్రెలక్క కన్న తండ్రి ఆమె గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కొల్లాపుర్ నియెజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కపై కన్నతండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోలో ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో బర్రెలక్క తండ్రీ మాట్లాడుతూ.. శిరీష అలియాస్ బర్రెలక్కకు అంగరంగ వైభవంగా వివాహం చేశాని తెలిపారు. కానీ భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుని తల్లితో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తన తండ్రి తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదని దుష్ప్రాచారం చేస్తుందని అదేమి నిజం కాదని వెల్లడించారు. కూతురు జీవితం బాగుండాలని ఇంటర్మీడియట్, అగ్రికల్చర్ కోర్స్ చదివించానని ఆయన అన్నారు. కుటుంబానికి అండగా ఉన్నానని, కానీ వాళ్లు లేని నిందలు నాపై మోపి దూరం పెట్టారని వాపోయారు. ఆస్తులు కూడా సంపాధించి పెట్టానని తెలిపారు. డాడీ నేను చదువుకుని నీపేరు నిలబెడతా అంటే.. ఐఏఎస్ అయ్యేంత వరకు చదివిస్తాను దానికోసం వంటల పని, హోటల్ నడిపిస్తాను అని బర్రెలక్కతో చెప్పినట్లు ఆయన చెప్పారు.

కానీ బర్కెలక్క మాత్రం బుద్దిగా చదువుకోలేదని తెలిపారు. పదో తరగతి చదివేటప్పుడు అమ్మ తిడుతుంది, అందరు తిడుతున్నరని నిద్ర మాత్రలు మింగిందని తెలిపారు. పదేళ్ల కిందనే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లాడని చెప్తుంది. మరి నేను అప్పడు వదిలేసి వెళ్తే వీళ్లను చదివించింది ఎవరు? నేనే చదివించాను కదా అని అన్నారు. రెండు ఇళ్లులు కూడా కట్టించాను అని బర్రెలక్క తండ్రీ తెలిపారు. మరి తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బర్రెలక్క ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక రాష్ట్ర ఎన్నికల్లో బర్రెలక్క సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనకు రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది బర్రెలక్క, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మరి బర్రెలక్కపై కన్న తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio