P Krishna
Ex minister Dr Lakshmareddy: ఇటీవల రాజకీయ, సినీ రంగాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వివిధ కారణాల వల్ల ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు.
Ex minister Dr Lakshmareddy: ఇటీవల రాజకీయ, సినీ రంగాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వివిధ కారణాల వల్ల ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు.
P Krishna
ఈ మధ్య కాలంలో సినీ, రాజకీయ నేతల కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. వయోభారం, హార్ట్ ఎటాక్,అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూయడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ గులాబీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్వేత ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో లక్ష్మారెడ్డి ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.హూమియోపతి డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి.. జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా, తర్వాత ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆయన భార్య శ్వేత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. లక్ష్మారెడ్డి భార్య మృతిపై బీఆర్ఎస్, ఇతర పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ నేత, బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణ కన్నుమూసి వారం రోజులు కూడా గడవక ముందే బీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం చెటు చేసుకోవడంతో అటు నేతలు, ఇటు కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.