Telangana: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా రూ.1500!

డీఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న క్రమంలో.. ఇటీవల తెలంగాణాలో డీఎస్సి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం డీఎస్సి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

డీఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న క్రమంలో.. ఇటీవల తెలంగాణాలో డీఎస్సి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం డీఎస్సి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిరుద్యోగులు ఏళ్ల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సి నోటిఫికెషన్స్ ను విడుదల చేశారు. దీనితో కేవలం తెలంగాణా నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా.. ఈ పరీక్షకు భారీ సంఖ్యలో హాజరుకాబోతున్నారు. ఇప్పటికే అందరు ఈ పరీక్షలకు సంబంధించిన ప్రేపరేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే , చాలా మంది ఈ ఎగ్జామ్స్ ను రాయడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ, వారి దగ్గర సరైన స్టడీ మెటీరియల్స్ , వసతులు లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బీసీ విద్యార్థులకు.. ఆ సెంటర్ వారు ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సి కి ప్రిపేర్ అవుతున్న .. బీసి విద్యార్థులకు.. బీసీ స్టడీ సర్కిల్ ఓ గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేంటంటే ఈ పరీక్షలకు సన్నద్ధం అయ్యే.. అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ వారు .. బుక్ ఫండింగ్ తో పాటు.. స్టడీ మెటీరియల్ ను కూడా అందించనున్నట్లు .. ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా .. మొత్తం పదివేల మందికి ఈ సహాయాన్ని అందిస్తున్నారు. అయితే, ఈ పది వేల మందిలో.. ఏడు వేల మంది అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు, మూడు వేల మంది అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు .. ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఇందులో ఎంపికైన వారికీ ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున.. బుక్ ఫండింగ్ తో పాటు.. స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందించబోతుంది.

అంతేకాకుండా అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్స్ ఆధారంగా.. అభ్యర్థులను వీటికోసం ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. పైగా వారు చెప్పిన ఆఫర్ ను పొందాలంటే.. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం.. రూ.5 లక్షల కంటే మించి ఉండకూడదు. ఇక దీనికి సంబంధించి.. అభ్యర్థులంతా కూడా.. .. ఆర్ధిక సహాయం పొందేందుకు ఏప్రిల్5 లోగా.. ఆన్లైన్ లో ఉన్న తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ లో.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి, ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments