ఈ దగ్గు మందును వాడుతున్నారా.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల హెచ్చరిక

Hyderabad: సాధారణంగా ఎవరైనా  సీజనల్ ఇన్​ఫెక్షన్స్  వాళ్ల కానీ, మరి ఏ ఇతర  కారణాల చేతగానీ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో కచ్చితంగా దగ్గు మందు వాడుతుంటారు. కానీ, ఈ దగ్గు మందు వాడితే ప్రాణానికే ప్రమాదమని తాజాగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

Hyderabad: సాధారణంగా ఎవరైనా  సీజనల్ ఇన్​ఫెక్షన్స్  వాళ్ల కానీ, మరి ఏ ఇతర  కారణాల చేతగానీ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో కచ్చితంగా దగ్గు మందు వాడుతుంటారు. కానీ, ఈ దగ్గు మందు వాడితే ప్రాణానికే ప్రమాదమని తాజాగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుతం సీజన్ మారింది. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ భారీ వర్షాల కారణంగా.. చాలామంది జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. ఆ సమయంలో ఆసుపత్రికి కానీ ,స్థానిక మెడికల్ స్టోర్ కి కానీ, వెళ్లి అక్కడ ట్యాబ్లెట్స్ తో పాటు దగ్గు సిరప్ ను కూడా తీససుకుంటాం. ఇలా ఇళ్లలో చిన్న నుంచి పెద్ద వరకు దగ్గు ఎక్కువగా ఉన్నవారు సిరప్ ను కచ్చితంగా వాడుతుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో ఈ దగ్గు సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని,వీటిని తీసుకోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయని ప్రపంచ దేశాల్లో చాలా కథనాలు వినిపించిన విషయం తెలిసిందే.అయితే ఇండియాలో కూడా ఈ దగ్గు మందు వాడితో ప్రాణాలకు ప్రమాదమని తాజాగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధరణంగా దగ్గు వచ్చినప్పుడు ఎవరైనా సరే గ్లైకోరిల్ కాఫ్ సిరప్ను వాడుతారు. కానీ,ఇక నుంచి ఆ గ్లైకోరిల్ కాఫ్ సిరప్ను వాడొద్దని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు. ఈ మేరకు నగరంలో కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో దగ్గు మందును తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తాజాగా దాడులు చేశారు. అయితే ఆ కంపెనీలో సుమారు రూ.65 వేలు విలువ చేసే స్టాక్ ను అధికారులు సీజ్ చేశారు. ఎందుకంటే.. ఆ కంపెనీలో దగ్గు మందు తయారీలో ఎటువంటి నిబంధనలను పాటించడం లేదని, కనుక ఈ దగ్గు మందు వాడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారు. పైగా ఇలాంటి దగ్గు మందులు ఎక్కడ కనిపించినా వెంటనే తమకు తెలియజేయాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు. కాగా,ఇప్పటికే ఇండియాలో తయారు చేసిన ఈ కాఫ్ సిరప్ లు వలన ప్రపంచ దేశాల్లో 141 మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పటికే ఇండియాలో తయారైయ్యే 100కు పైగా దగ్గు మందులను సీజ్ చేసి లాబ్ టెస్టింగ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ దగ్గ మందు సిరప్ లు గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లల మరణాలకు కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2022లోనే తేల్చి చెప్పింది. అప్పటి నుంచి భారత్ లో తయారవుతున్న దగ్గు మందులపై కేంద్ర ప్రభుత్వం,డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. పలు మెడికల్ ఫార్మ కంపెనీల్లో తనిఖీలు చేసి ఆయా మందులను సీజ్ చేసి లాబ్ కు పంపించడం జరిగింది. అయిన సరే కొన్ని కంపెనీలు తీరు మార్చుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి ప్రమాదకరమైన దగ్గు మందులను తయారు చేస్తూ మార్కెట్ లో విక్రయిస్తున్నారు.

దీని వల్ల చాలా ప్రమాదమని దయచేసి ప్రజలు ఈ దగ్గు మందును వాడకూడదని, ఇలాంటి సిరప్ కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతవరకు ప్రపంచ దేశాల్లోనే అనుకుంటే ఇప్పుడు ఇండియాలో కూడా దగ్గు మందులు వాడకూడదని స్పష్టంగా అధికారులు తేల్చి చెప్పడంపై ప్రజలు తీవ్ర భయంద్రోళనలో ఉన్నారు. అసలు మార్కెట్ లో ఏ దగ్గు మందు వాడాలో ఏదో సురక్షితమే తేలియక తీవ్ర గందరగోళంలో ఉన్నారు. మరీ, ఇండియాలో ఈ గ్లైకోరిల్ సిరప్ వినియోగించవద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంలో తెలియజేయండి.

Show comments