iDreamPost
android-app
ios-app

దారుణం: బాలింతకు డెలివరీ చేసి కడుపులో దూది మరిచిన డాక్టర్లు!

  • Published Aug 29, 2023 | 11:15 AM Updated Updated Aug 29, 2023 | 11:15 AM
  • Published Aug 29, 2023 | 11:15 AMUpdated Aug 29, 2023 | 11:15 AM
దారుణం: బాలింతకు డెలివరీ చేసి కడుపులో దూది మరిచిన డాక్టర్లు!

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలింతకు ఆస్పత్రిలో డెలవరీ సమయంలో వైద్యులు ఓ బాలింత కడుపులో కాటన్ దూది మరిచి అలాగే కుట్లు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కీర్తి లయ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె 9 నెలల గర్భవతి కావడంతో ఇటీవల పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 5 రోజుల కిందట మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇక కాన్పు కోసం వచ్చిన మహిళకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పండంటి బిడ్డకు జన్మచ్చింది. కాగా కీర్తి లయ ఆస్పత్రిలో రెండు రోజులు ఉండి ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కడుపులో ఏదో నొప్పిగా అనించేది. అయితే సోమవారం కీర్తికి ఆ నొప్పి మరింత ఎక్కువై తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని వైద్యులు పరిశీలించగా.. ఆమె కడుపులో ఏదో ఉందని గమనించారు. ఇక మొత్తానికి ఆపరేషన్ చేసి చూడగా ఆమె కడుపులో దూది కనిపించింది. దీన్ని చూసి వైద్యులు షాక్ గురయ్యారు. కాన్పు సమయంలో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి దూది అలాగే వదిలేశారని తెలుసుకున్నారు.

దీని కారణంగానే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురవుతున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూది మరిచి పోవడం ఏంటని మండిపడుతున్నారు. కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని వాపోతున్నారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో దూది మరిచిన వైద్యులు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: 40 అడుగుల జైలు గోడ దూకి అత్యాచార ఖైదీ పరార్‌!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet