Krishna Kowshik
Revanth Reddy Love Story: అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఓ ప్రభంజనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విశేషమైన కృషి చేశాడు రేవంత్. అయితే ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..
Revanth Reddy Love Story: అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఓ ప్రభంజనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విశేషమైన కృషి చేశాడు రేవంత్. అయితే ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..
Krishna Kowshik
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటుంటారు. అది తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో సత్యం. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది రేవంత్ రాజకీయ కెరీర్. విద్యార్థి దశ నుండే ఉద్యమకారుడిగా మారిన ఆయన.. పెయింటర్ నుండి నేడు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే స్థాయికి ఎదిగారు. ఆయన నేతృత్వంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగుర వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళుతోంది. రేవంత్ విజయానికి కారణం ఆయన పడ్డ కష్టమే కాదూ.. ధర్మ పత్ని భాగస్వామ్యం కూడా ఉంది. తెలంగాణలో నవ పాలనకు కారణమైన రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆయనది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి.
1969లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి.. స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి ఉద్యమాలు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా చాలా ప్రొగ్రెసివ్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె గీతా రెడ్డిపై మనస్సు పారేసుకున్నారు రేవంత్. ఇద్దరూ కాలేజీ చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. ఈ విషయం గీతారెడ్డి నాన్నకు తెలిసింది. రేవంత్ రెడ్డికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేని ఆయన..ఢిల్లీలో ఉన్న తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించేశారు. ఆ సమయంలో పొలిటికల్‌గా ఒత్తిడి కూడా ఆయనపై వచ్చినా.. తన ప్రేమను దక్కించుకోవడం కోసం వెనక్కు తగ్గలేదట. అటు గీతా సైతం రేవంత్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పారట.
ఏకంగా జైపాల్ రెడ్డితోనే రాయబారం చేసుకుని ఒప్పించుకున్నారట రేవంత్. ఆయనలోని ఆ మొండితనం, ధైర్యం, చురుకుతనం, చలాకీతనం గమనించి జైపాల్ రెడ్డి ఇతను భవిష్యత్తులో మంచి నేత అవుతాడని గ్రహించి.. సోదరుడ్ని ఒప్పించాడట. అందులోనూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పెళ్లికి అంగీకరించారు. గీతా రెడ్డిని రేవంత్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత పెయింటర్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి.. అంచెలంచలుగా ఎదిగారు. 2004లో టీడీపీలో చేరాడు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో టీడీపీ నుండి కొండగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2014లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు.
2017లో అక్టోబర్ లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ ఏడాది కొండగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2021లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక అప్పటి నుండి పార్టీని ముందుండి నడిపించి.. తెలంగాణలో అధికారాన్ని చేపట్టే స్థాయికి తీసుకెళ్లారు. ఆయన కష్టం, విజయం వెనుక ఆయన భార్య గీతా రెడ్డి ఉన్నారు. ఆయన పార్టీ అంటూ ప్రజా సేవకై వెళుతుంటే.. పిల్లల బాధ్యత ఆమె తీసుకున్నారు. అలా భర్తకు అన్ని విషయాల్లోనూ అండగా నిలిచారు. మరీ రేవంత్ లవ్ స్టోరీ, ఆయన సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.