Keerthi
TGSRTC: తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు తాజాగా టీజీ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రయాణికులకు బస్సులో ఆ టెన్షన్ ఉండదు.
TGSRTC: తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు తాజాగా టీజీ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రయాణికులకు బస్సులో ఆ టెన్షన్ ఉండదు.
Keerthi
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన తర్వాత.. మునపటికంటే ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే పెరిగిందని చెప్పవచ్చు. దీంతో బస్సులో రద్దీ కూడా బాగా పెరిగిపోవడంతో.. టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్టీటీసీ బస్సుల్లో రద్దీ విషయం పక్కన పెడితే.. చాలామంది ప్రయాణికులకు ఎదురయ్యే అది పెద్ద సమస్య చిల్లర. ఎందుకంటే.. చాలామందిక దగ్గర టికెట్టుకు సరిపడా చిల్లర ఉండకపోవచ్చు. దీంతో టికెట్ ఇచ్చిన తర్వాత చిల్లర విషయంలో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య ఎప్పుడు వాగ్వాదం నడుస్తునే ఉంటుంది. అంతేకాకుండా చిల్లర కోసం ఇబ్బందులు పడటమే కాకుండా.. గోడవలు కూడా జరిగే ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. కానీ, ఇక మీదట ఆ సమస్యల చెక్ పెడుతూ.. టీజీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు చాలా వరకు చిల్లర సమస్య వెంటాడుతునే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది. అందువల్ల ఇప్పుడు ఎవరూ చేతిలో డబ్బులను క్యారీ చేయడం లేదు. దీంతో బస్సుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో వస్తే బాగున్నాని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ లగ్జరీ, దూర ప్రాంతాలకు వెళ్లే నాన్‌స్టాప్ సర్వీసుల్లో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ ప్రయోగత్మాకంగా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)లో సాఫ్ట్‌వేర్‌ను సైతం అప్డేట్ చేశారు.
దీంతో ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డులతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందే అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఆ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అనగా.. ఇక నుంచి ఆ బస్సుల్లో కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు పొందవచ్చు. అలాగే ప్రయాణానికి సంబంధించిన సమస్యలను సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రయాణించే బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు క్యూ ఆర్ కోడ్‌ను కూడా పల్లె వెలుగు బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఆర్టీసీ ఏర్పాటు చేసిన డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్‌తో అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఒక్కసారి ఈ కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన పది రకాల యాప్‌లు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. పైగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్(వెబ్‌సైట్), గమ్యం(ఆండ్రాయిడ్ ఐఓఎస్) తదితర సేవలను పొందవచ్చు. ప్రయాణికులకు పూర్తిస్తాయిలో సేవలందించేందుకు పల్లె వెలుగు బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే త్వరలోనే ఈ సేవలు కనుక అందుబాటులోకి వస్తే ఇక ప్రయాణికులకు చిల్లర సమస్య ఉండదని చెప్పవచ్చు. మరి, టీజీ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.