సన్ రూఫ్ తీసి కారులో తిరిగేస్తున్నారా? ఈ వీడియో చూస్తే మళ్లీ అలా చేయరు!

Cyberabad Traffic Police: కారు కొనుక్కున్న తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్లాలి అని ఉంటుంది. అదే సన్ రూఫ్ ఉన్న కారు అయితే చక్కగా సన్ రూఫ్ ఓపెన్ చేసి షికార్లు చేయాలి అనిపిస్తుంది. కానీ, అలా చేయడం ఎంత ప్రమాదమే ఒకసారి ఈ వీడియో చూడండి.

Cyberabad Traffic Police: కారు కొనుక్కున్న తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్లాలి అని ఉంటుంది. అదే సన్ రూఫ్ ఉన్న కారు అయితే చక్కగా సన్ రూఫ్ ఓపెన్ చేసి షికార్లు చేయాలి అనిపిస్తుంది. కానీ, అలా చేయడం ఎంత ప్రమాదమే ఒకసారి ఈ వీడియో చూడండి.

హైదరాబాద్ లాంటి మహా నగరాలు, మెట్రో పాలిటన్ సిటీల్లో మనుషుల జీవనశైలి మారిపోతోంది. లేట్ నైట్ పార్టీలు, సినిమాలు, షికార్లు, లాంగ్ డ్రైవ్స్ జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. నైట్ లైఫ్, లాంగ్ డ్రైవ్స్ అంటే పెద్దలతో పాటుగా పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోయారు. అయితే ఈ నైట్ లైఫ్, లాంగ్ డ్రైవ్స్ వల్ల ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో.. అంతే ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లలు, పెద్దలు కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

కారులు కొనడం, వాటిలో షికార్లు చేయడం అందరికీ అలవాటు అయిపోయింది. మధ్యతరగతి వాళ్లు కూడా మంచి మంచి కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్లు పెరిగిన తర్వాత ప్రమాదాలు కూడా అలాగే పెరుగుతూ వస్తున్నాయి. కొందరైతే పిల్లలను తీసుకుని సన్ రూఫ్ ఓపెన్ చేసి హైదరాబాద్ మొత్తం షికార్లు చేస్తూ ఉంటారు. మీరు కూడా హైదారాబాద్ లో అలాంటి వారిని చాలామందినే చూసి ఉంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేందుకు సైబదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక వీడియో షేర్ చేశారు. సన్ రూఫ్ ఓపెన్ చేసి కారుల్లో షికార్లు చేసే వారు ఇది ఒకసారి తప్పక చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. అలా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ప్రాక్టికల్ గా చూపించారు.

ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో.. ఒక అబ్బాయి, అమ్మాయి కారులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్లు కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి ఉన్నారు. అయితే డ్రైవర్ కూడా రోడ్డును సరిగ్గా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఎదురుగా వెళ్తున్న కారు స్లో అవ్వగానే.. దానిని పట్టించుకోకుండా సన్ రూఫ్ ఓపెన్ చేసి ఉన్న కారు అతను ఎదురు కారును ఒక్కసారిగా గుద్దేశాడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సీటులో ఉండి.. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాదంలో గాయాలు కాకుండా ఉంటాయి. కానీ, వీళ్లు సన్ రూఫ్ ఓపెన్ చేసి నిల్చుని ఉండటంతో ఎక్కువ గాయాలు అయినట్లు తెలుస్తోంది.

అలాంటి సమయాల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి రావచ్చు. అందుకే సీటులో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుని మాత్రమే ప్రయాణం చేస్తే మంచిది. అదే విషయాన్ని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కారులో ప్రయాణం చేసే మమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అలాగే పిల్లలను కూడా సన్ రూఫ్ ఓపెన్ చేసి తిప్పడం అలవాటు చేయకపోవడమే మంచిది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments