iDreamPost
android-app
ios-app

హామీల అమలుకు.. బాండ్ రాసి, దేవుడి ఎదుట ప్రమాణం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి!

  • Published Nov 27, 2023 | 9:50 PM Updated Updated Nov 27, 2023 | 9:50 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చేందుకు బాండ్ పేపర్ రాశారు. ఆ వివరాలు మీకోసం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చేందుకు బాండ్ పేపర్ రాశారు. ఆ వివరాలు మీకోసం..

  • Published Nov 27, 2023 | 9:50 PMUpdated Nov 27, 2023 | 9:50 PM
హామీల అమలుకు.. బాండ్ రాసి, దేవుడి ఎదుట ప్రమాణం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుడగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ లీడర్లు ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కలియ తిరుగుతున్నారు. ఓటర్లకు పలు రకాల హామీలను ఇస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విభిన్నంగా ఆలోచించి నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు బాండ్ పేపర్ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కీలక నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రజలకు ముక్తకంఠంతో చెప్తున్నారు. దీంతోపాటు వ్యక్తి గతంగా కూడా ప్రజలకు నమ్మకం కలిగేలా హామీ ఇచ్చారు మల్లు భట్టి విక్రమార్క. 100 రూపాయల బాండ్ పేపర్ పై ప్రజలకు చేసే సేవపై హామీ ఇస్తూ లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. దేవుడి సన్నిధిలో ఆ బాండ్ పేపర్ ను చదివి వినిపించారు. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి బాండ్ పేపర్ పై సంతకం చేశారు.

నా పేరు మల్లు భట్టి విక్రమార్క. నేను మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నాను. ఈ సందర్భంగానియోజకవర్గ ప్రజలకు ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ.. ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని భట్టీవిక్రమార్క ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్ రూపంలో హామీ ఇవ్వడంతో సర్వత్రా చర్చమొదలైంది. మరి ప్రజలకు బాండ్ పేపర్ రాసి హామి ఇచ్చిన మల్లు భట్టి విక్రమార్క గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mallu Bhatti Vikramarka (@bhatti_vikramarka)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom