ఆటో, ఊబర్ డ్రైవర్లతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఆ బెనిఫిట్స్ ఇస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఏం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఈ స్కీమ్ తో మహిళలు సంతోషంలో ఉన్నా.. ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి బెనిఫిట్స్ కల్పిస్తారన్న విషయంపై చర్చ సాగుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిపోయింది. ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నా.. కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తుంది. విద్యార్థులు, దూర ప్రాంతాల్లో ప్రయాణించేవారు, ఉద్యోగులు బస్సుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఆటో, ఊబర్ డ్రైవర్లు తెగ కష్టాలు పడుతున్నారు. మహిళలకు ఫ్రీ సర్వీస్ ద్వారా తమ బతుకుదెరువు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆటో, ఊబర్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి బేటీ కాబోతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్స్ లో ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో భేటీ అయిన ప్రత్యామ్నాయ ఉపాది మార్గాలపై చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.12000 ఆర్ధిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధి విధానాలు రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్కీమ్ ఎవరికి వర్తించాలనేదానిపై చర్చలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం ద్వారా లబ్ది ఎవరు పొందాలి.. ఆటో ఓనర్లా, డ్రైవర్లా అనేదానిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై నేడు చర్చలు జరిగే చాన్స్ ఉందని.. వీటికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాక అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకొని త్వరలో అమలు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియ లోక్ సభ ఎన్నికల ముందే చేయాలనే ఆటోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. కాకపోతే అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments