Revanth Reddy-Prajapalana: ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

Revanth Reddy: ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాలనలో తన మార్కు చూపెడుతున్నారు. దూకుడుగా ముందుకు సాగుతన్నారు. ఈ క్రమంలో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాలనలో తన మార్కు చూపెడుతున్నారు. దూకుడుగా ముందుకు సాగుతన్నారు. ఈ క్రమంలో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పాలనలో దూకుడుగా ముందుకు సాగుతన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే.. తన మార్కు పాలన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీద సంతకం చేశారు. అంతేకాక ఆ హమీలను అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయగా.. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. అలానే మిగితా హామీల అమలకు కోసం మార్గదర్శకాలు రెడీ చేసే ప్రయత్నంతో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే.. ప్రగతి భవన్ పేరు మార్చడమే కాక.. అక్కడ ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ఇక ప్రస్తుతం ప్రజాభవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతేకాక దీనితో పాటు ప్రజాపాలన అనే నూతన కార్యక్రమం నిర్వహించాలని భావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా దీని గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వివరాలు..

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మేరకు సెక్రటేరియేట్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ఈ సందర్బంగా చర్చించారు సీఎం రేవంత్‌.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మన మధ్య సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేం. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి. గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. కానీ నా దృష్టిలో పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అని నమ్ముతాను. ఇతర రాష్ట్రాల అధికారులు తప్పకుండా స్థానిక భాష నేర్చుకోవాలి. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలి. అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలి.. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి’ అని సూచించారు.

‘ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. విధి నిర్వహణలో ప్రతీ ఒక్క అధికారి.. ఎస్‌ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. సంక్షేమం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. అలానే అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు’ అన్నారు.

‘అంతేకాక అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. పని చేయలేమనే ఉద్దేశ్యం ఉంటే ఇప్పుడే తప్పుకోండి. అధికారులంతా కచ్చితంగా 18 గంటలు పని చేయాల్సిందే’ అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Show comments