Revanth Reddy: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 30,750 కొత్త ఉద్యోగాలు

CM Revanth Reddy-America Tour: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. ఏకంగా 30 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

CM Revanth Reddy-America Tour: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. ఏకంగా 30 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు బోలేడు ఆశలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదే భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో నిరుద్యోగులు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆ హామీలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని.. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు కాంగ్రెస్‌ నేతలు. అలానే జాబ్‌ క్యాలెండర్‌ కూడా విడుదల చేశారు. ఈక్రమంలో తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్తగా 30,750 ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి అంటూ తెలంగాణ సీఎంఓ ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైందని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.

కాగా, అమెరికా పర్యటన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. తమ బృందం యూఎస్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు.

Show comments