ఇప్పుడు ఇద్దరం సివిల్స్ రాద్దామా?.. స్మితా సభర్వాల్ కు బాలలత సవాల్!

Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్  వింకలాంగుల కోటాపై  చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. ఆమె చేసిన ట్విట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆమెపై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారు.

Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్  వింకలాంగుల కోటాపై  చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. ఆమె చేసిన ట్విట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆమెపై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారు.

ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ ల వివాదలు ఎక్కువగా వస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు కర్నాటక కేటర్ గి చెందిన ఇద్దరు సివిల్ సర్వెంట్స్ మధ్య జరిగిన వివాదం గురించి అందరికి తెలిసింది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఆ  ఇద్దరు మహిళ సివిల్ సర్వెంట్స్ వార్తల్లో నిలిచారు. అలానే ఇటీవల ట్రైనీ ఐఏ ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివా ఇరుక్కున్న సంగతి తెలిసింది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు ఓ వివాదంలో  పడ్డారు. ఈ క్రమంలో ఆమెపై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారు. అంతేకాక స్మితా  సబర్వాల్ కి ఓ సవాల్ కూడా విసిరారు. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్  వింకలాంగుల కోటాపై  చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. పూజా ఖేద్కర్ వివాదం నేపథ్యంలో అఖిల భారత సర్వీసెస్ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ స్మితా సబర్వాల్  ట్వీట్ చేశారు. సివిల్ సర్వీస్ ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్విట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో వారి అభిప్రాయాలకు స్మితా కూడా సమాధానం చెప్తుండటం గమనార్హం. తాజాగా స్మితా సభర్వాల్ చేసిన ట్విట్ పై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారు.

 దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మితాకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాలలత మీడియా సమావేశంలో స్మితా సభర్వాల్ ట్వీట్ పై స్పందించారు. ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావని అంటూ స్మిత సభర్వాల్ కు బాలలత సవాల్ విసిరారు. అసలు క్షేత్ర స్థాయిలో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందని బాలలత ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడరని అన్నారు. ఇప్పటికే వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సభర్వాల్  చేసిన ట్వీట్ మరింత కుంగదీసాయని బాలలత తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి అపాయింట్ మెంట్ ఇచ్చింది వికలాంగురాలికేనని ఆమె గుర్తు చేశారు. కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సభర్వాల్ పైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బాలలత  కోరింది.

Show comments