నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ భారీ గుడ్ న్యూస్.. ఏంటంటే?

నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ భారీ గుడ్ న్యూస్.. ఏంటంటే?

హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో నగర వాసులకు ఆ కష్టాలు తీరనున్నాయి. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?

హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో నగర వాసులకు ఆ కష్టాలు తీరనున్నాయి. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?

గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ కు దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. నగరంలో ఉన్న మౌళిక సదుపాయాలు, సెక్యూరిటీ కారణంగా లివింగ్ కు అనువైన నగరంగా ప్రఖ్యాతిగాంచింది హైదరాబాద్. ఇక నగర ఖ్యాతిని మరింత చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నగరవాసులకు శుభవార్త అందించారు. ప్రజలకు, వ్యాపారస్తులకు ప్రయోజనం కలిగేలా నగరంలో రాత్రి ఒంటిగంట వరకు అన్ని దుఖానాలు ఓపెన్ చేసుకోవచ్చని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు తప్ప మిగతా అన్నింటికి పర్మిషన్ ఇచ్చారు.

ఇది వరకు హైదరాబాద్ లో రాత్రి 11 గంటలకే షాప్స్ మూసేయాలంటూ పోలీసులు వ్యాపారులపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో షాప్స్ క్లోజ్ చేయించడంపై ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి రాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు మద్యం దుఖానాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. రాత్రి 11 గంటలకే మద్యం దుఖాణాలు బంద్ కానున్నాయి.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు తప్ప.. మిగతా అన్ని షాపులు తెరుకోడానికి పర్మిషన్ ఇస్తున్నామని ఇప్పటికే పోలీసులతో మాట్లాడినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా అన్ని షాప్స్ రాత్రి ఒంటిగంట వరకు ఓపెన్ కానున్నాయి. నగరంలో ఫేమస్ రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల వద్ద నగర ప్రజలు ఫుడ్ కోసం వెళ్తుంటారు. గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ తో ఇక అర్దరాత్రి కూడా ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. నైట్ లైఫ్ మళ్లీ స్టార్ట్ కానుంది. సీఎం రేవంత్ నిర్ణయంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments