Video:హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో ఎడ్లబండి.. వింతగా చూసిన జనాలు!

హైదరాబాద్ మహానగరంలో నిత్యం రద్దీ అయిన రోడ్లు ట్రాఫిక్ తో బిజీబిజీగా ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి నగరంలో ఉన్నటుండి ఓ వాహనం అనేది దర్శనిమివ్వడంతో అందరూ వింతగా ఆశ్చర్యపోయారు. ఇంతకి అదేమిటంటే..

హైదరాబాద్ మహానగరంలో నిత్యం రద్దీ అయిన రోడ్లు ట్రాఫిక్ తో బిజీబిజీగా ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి నగరంలో ఉన్నటుండి ఓ వాహనం అనేది దర్శనిమివ్వడంతో అందరూ వింతగా ఆశ్చర్యపోయారు. ఇంతకి అదేమిటంటే..

పట్టణ ప్రాంతాలంటే.. నిత్యం రద్దీ అయిన రోడ్లు ట్రాఫిక్ తో బిజీబిజీగా ఉంటుంది. అందులో హైదరాబాద్ మహానగరం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఇక్కడ బైకుల కన్నా రకరకాల కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక నిత్యం ఈ వాహనాల హోరన్లతో చెవులు మోత మోగిపోతుంటాయి. వీటితో పాటు నగరవాసుల తొందరగా తమ గమ్య స్థానానికి చేరుకోనేలా, సౌకార్యానికి అనుగుణంగా.. మెట్రో రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉన్నటుండి కనుమరుగైన ఓ వాహనం అనేది దర్శనిమిచ్చింది. దీంతో పట్టణ ప్రజలకు ఎంతో వింతగా ఆశ్చర్యంగా కనువిందు చేసింది. దీంతో అందరూ ఆ వాహనాన్ని చూస్తూ.. తెగ ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఇంతకి అదేమిటంటే..

సాధారణంగా భాగ్యనగరం అంటేనే నిత్యం ఉరుకులు, పరుగులతో సాగే జీవితం. ఇక్కడ అంతా ప్రపంచంతో పోటీ పడుతూ రాత్రి, పగలు తేడా లేకుండా.. పని చేస్తుంటారు. పైగా ఇక్కడ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం మొదలు ప్రజలు తమ గమ్య స్థానానికి చేరడానికి రకరకాల వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అసలు ఇక్కడ పల్లెలో ఉండే వాతవరణం ఎంత మేరకు కనిపించదు. అలాంటి నగవాసులకు ఉన్నటుండి రోడ్లపై ఓ ఎడ్లబండి దర్శనమిచ్చింది. అది కూడా ఎప్పుడూ రద్దీగా ఉండే హైటెక్ సిటీ దగ్గర కనిపించింది. దీంతో అసలు పల్లె వాతవరణం ఏరగని వారు కూడా ట్రాఫిక్ లో ఎడ్లబండి కనిపించడంతో చాలా ఆశ్చర్యంగా చూడ సాగారు.

అంతేకాకుండా ఆ ఎడ్ల బండి మీద ఓ రైతు కూడా కనిపించాడు. అతడు తన ఎడ్ల బండిలో గడ్డిని తరలిస్తున్నాడు. అయితే.. సరిగ్గా హైటెక్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రాగానే సిగ్నల్ పడటంతో.. ట్రాఫిక్ లో అగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు ఆ ఎడ్లబండిని ఎంతో వింతగా చూస్తున్నారు. పైగా అదేదో బ్రహ్మపదార్థమన్నట్టుగా.. తెగ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం గ్రామాల్లోనూ ఎడ్లబండ్లు కనుమరుగవుతుండటంతో నగరంలో ఇలా రోడ్లపై దర్శనమివ్వటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు.

అందులో ఒక నెటిజన్.. ‘రాజు ఎక్కడున్నా.. రాజే రా’ అంటూ రైతును ఉద్దేశించి బాహుబలి డైలాగ్ కొట్టాడు. మరో నెటిజన్ ‘ఐటీ పార్కు వద్దకు రైతు పోలేదు, రైతు వద్దకే ఐటీ పార్కు వచ్చిందంటూ’ కామెంట్ పెట్టాడు. కాగా, మరో నెటిజన్ ‘రైతు ఎంట్రీతో సైబర్ టవర్‌కే అందం వచ్చిందంటూ’.. కామెంట్లు చేశాడు. ఏదెమైనా సిటీలో ఖరీదైన కార్లు తిరిగే రోడ్లపై ఇలా ఎడ్లబండి దర్శనమివ్వడం.. గొప్ప విషయమంటూ మరికొందరు తమ అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. మరి, నగరంలో ఇలా ఎడ్ల బండి దర్శనమివ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments