P Krishna
Hyderabad: మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులై అయినా.. మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేది గురువు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఉన్నత స్థానం ఉంటుంది. విద్యార్థులు గురువును దైవంగా భావిస్తుంటారు.
Hyderabad: మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులై అయినా.. మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేది గురువు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఉన్నత స్థానం ఉంటుంది. విద్యార్థులు గురువును దైవంగా భావిస్తుంటారు.
P Krishna
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువును త్రిమూర్తులతో పోల్చుతుంటారు. మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులై అయినా.. జీవితానికి పరమార్థం నేర్పేది గురువు. ఉన్నత విద్యావంతుడిగా తీర్చి దిద్దిది గురువే. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఉన్నత స్థానం ఉంటుంది. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తుంటారు. కానీ.. ఈ మధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారిని లైంగికంగా వేధించడం.. అత్యాచారాలకు పాల్పపడటం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఓ టీచర్ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
రాజేంద్రనగర్ బుద్వేల్ జడ్‌పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ పదవ తరగతి విద్యార్థినులకు ప్రత్యేక క్లాసుల పేరుతో వారి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటపై ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ విషయం గురించి ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీరాణి మాట్లాడుతూ…బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో వేణుగోపాల్ రావు ఫిజిక్స్ టీచర్ గా కొనసాగుతున్నారు. తోటి ఉపాధ్యాయులతో అతడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. తాను ఏం చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. తన ఇష్టమైన టైమ్ కి స్కూల్ కి వచ్చేవాడు. కేవలం పదో తరగతి బాలికలకు మాత్రమే స్పెషల్ క్లాసులు చెబుతానంటూ క్లాస్ రూమ్ లో వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అమ్మాయిలతో ఎప్పుడు ద్వందర్ధాలతో మాట్లాడేవాడు.
స్కూల్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ క్లీయర్ చేస్తా ఇంటికి రమ్మని పిలిచేవాడు. అతని వికృత చేష్టలు విద్యార్థినులు భరించలేకపోయారు.తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి నాతో చెప్పారు. నేను వెంటనే ఈ విషయం గురించి ఆ టీచర్ ని మందలించాను. నా మాటలు లెక్క చేయకుండా నన్నే దుర్భాషలాడాడు. వారం రోజులుగా ఇష్టానుసారంగా వీడియోలు తీస్తూ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాడు. సోమవారం విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల విషయం గురించి ప్రశ్నించగా నాతో దురుసుగా మాట్లాడాడు. ఇక చేసేదేమి లేక నాతో పాటు టీచర్లు, విద్యార్థినులు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశాం. స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి మాకు మద్దతు తెలిపారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వచ్చి వేణుగోపాల్ రావును స్టేషన్ కి తరలించారు. ఆ కీచక టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఈవోకి ఫిర్యాదు చేశాం. ఈ విషయంపై స్పందించిన ఎంఈవో శంకర్ నాయక్.. వేణుగోపాల్ రావు ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా తరుచూ ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉన్నాయి. కొంతమంది మూర్ఖుల వల్ల గురువు అన్న పదానికి విలువ లేకుండా పోతుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించే గురువుల విషయంలో తాత్సారం చేయకుండా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన బుద్ది చెప్పాలని అంటున్నారు మహిళా సంఘాలు.